యాప్నగరం

లా కమిషన్ సిఫార్సులు..ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ

ఇకపై బీసీసీఐ కూడా ఆర్టీఐ పరిధిలోకి రాబోతోంది. క్రికెట్ బోర్డును కూడా సమాచార హక్కు చట్టం కిందకు తీసుకు రావచ్చంటూ లా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

Samayam Telugu 18 Apr 2018, 5:30 pm
ఇకపై బీసీసీఐ కూడా ఆర్టీఐ పరిధిలోకి రాబోతోంది. క్రికెట్ బోర్డును కూడా సమాచార హక్కు చట్టం కిందకు తీసుకు రావచ్చంటూ లా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌లన్నీ ఆర్టీఐ కింద ఉన్నప్పుడు... బీసీసీఐని ఎందుకు చేర్చకూడదని ప్రశ్నించింది. ప్రభుత్వం కనుక ఈ సిఫార్సులను ఆమోదిస్తే... క్రికెట్ బోర్డు కూడా పబ్లిక్ బాడీ కిందకు వస్తుంది. అలాగే సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసి... వివరాలు, సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. బీసీసీఐకి జవాబుదారీతనాన్ని కల్పించాలని లా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
Samayam Telugu BCCI-RTI


రాజ్యాంగంలోని అధికరణ 12 ప్రకారం ప్రభుత్వ సంస్థగా ప్రకటించడానికి బీసీసీఐకి అన్ని అర్హతలు ఉన్నాయని లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చౌహాన్ ఇటీవల వ్యాఖ్యానించారు. అలాగే 2016లో సుప్రీం కోర్టు కూడా క్రికెట్ బోర్డును ఆర్టీఐ పరిధిలోకి తెచ్చేందుకు న్యాయపరమైన కసరత్తు చేయాలని కమిషన్‌కు సూచించింది.
Read This Story Also In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.