యాప్నగరం

కోహ్లీ.. ఓ బ్యాటింగ్ మాస్టర్: పాక్ ఓపెనర్ ప్రశంస

ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో రెండో శతకం బాది.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్న భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీని

Samayam Telugu 23 Aug 2018, 5:16 pm
ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో రెండో శతకం బాది.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్న భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీని ‘బ్యాటింగ్ మాస్టర్‌’గా పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్ అభివర్ణించాడు. ఇంగ్లాండ్‌తో నాటింగ్ హామ్ వేదికగా బుధవారం ముగిసిన మూడో టెస్టులో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లో 97, 103 పరుగులు చేసి భారత్ విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి బ్యాటింగ్‌ చూస్తూ తాను చాలా నేర్చుకున్నానని పాక్ ఓపెనర్ చెప్పుకొచ్చాడు.
Samayam Telugu DlDieZBWwAIvzrE


తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి ఫకార్ జమాన్ మాట్లాడుతూ ‘విరాట్ కోహ్లి వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కష్టపడటం ద్వారా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చనడానికి అతనే ఉదాహరణ. అందరిలానే కోహ్లి బ్యాటింగ్‌ను నేను కూడా ఆస్వాదిస్తాను.. అతని ఆటని చూడటం ద్వారా చాలా నేర్చుకోవచ్చు. కోహ్లీ ఓ బ్యాటింగ్‌ మాస్టర్’ అని కితాబిచ్చాడు.

పాకిస్థాన్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా ఇటీవల రికార్డు నెలకొల్పిన ఫకార్ జమాన్.. గత ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో శతకం బాది భారత్‌ను పాక్ ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.