యాప్నగరం

మనోళ్లను బెంగళూరులో ‘గిరగిరా’ తిప్పేశారు..!

లియాన్ ధాటికి చివరి ఐదు మంది బ్యాట్స్‌మెన్లు కేవలం 15 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్‌కి క్యూ కట్టారు

TNN 4 Mar 2017, 3:55 pm
టెస్టులో నెం.1 భారత్ జట్టు బెంగళూరులో ఘోర అవమానం ముంగిట దిగాలుగా నిల్చొంది. పుణె టెస్టు ఓటమి నుంచి కోహ్లిసేన పాఠాలు నేర్చుకుంటుందని ఆశించిన సగటు అభిమాని ఆశల్ని నీరుగారుస్తూ బెంగళూరులోనూ పేలవ ప్రదర్శనతో నిరాశపర్చింది. ఆస్ట్రేలియాతో శనివారం ఆరంభమైన రెండో టెస్టులో స్పిన్నర్ నాథన్ లియాన్ (8/50) ధాటికి భారత్ 189 పరుగులకే కుప్పకూలిపోయింది. ఒక ఎండ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (205 బంతుల్లో 90 పరుగులు) ఒంటరి పోరాటం చేసినా.. ఫలితం లేకపోయింది.
Samayam Telugu lyon spins australia to dominant position
మనోళ్లను బెంగళూరులో ‘గిరగిరా’ తిప్పేశారు..!


గాయపడిన మురళీ విజయ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఓపెనర్ అభినవ్ ముకుంద్ (0)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి (12), పుజారా (17), రహానె (17), కరుణ్ నాయర్ (26) ఇలా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లంతా తడబడి వికెట్లను పారేసుకున్నారు. దీంతో
రెండో సెషన్‌లోనే భారత్‌ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. టీ బ్రేక్ అనంతరం లియాన్ ధాటికి చివరి ఐదు మంది బ్యాట్స్‌మెన్లు కేవలం 15 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్‌కి క్యూ కట్టారు. అశ్విన్ (7), సాహా (1), జడేజా (3), ఉమేశ్ యాదవ్ (0), ఇషాంత్ శర్మ (0) కనీసం రెండంకెల స్కోరు కూడా నమోదు చేయలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లియాన్ 8, మిచెల్ స్టార్క్, ఒకీఫ్ చెరో వికెట్ తీశారు. పుణెలో భారత్ 333 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.