యాప్నగరం

ధోనీ చేజారనున్న టాప్ గ్రేడ్ కాంట్రాక్ట్?

ఆటగాళ్లకు కొత్త గ్రేడ్‌లను ఇచ్చేందుకు సిద్ధం కాగా.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి టాప్ గ్రేడ్ దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది.

TNN 4 Jan 2018, 1:13 pm
బీసీసీఐ టాప్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను మహేంద్ర సింగ్ ధోనీని మిస్సయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. భారత క్రికెటర్ల వేతనాలను పెంచేందుకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆమోదం తెలిపింది. ఈ విషయమై గతంలో విరాట్ కోహ్లి, ధోనీ, రవిశాస్త్రి కూడా కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. ఆటగాళ్ల కాంట్రాక్టులను ఏ+, ఏ, బి, సిగా విభజించాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. కమిటీ మార్గదర్శకాల ప్రకారం ఏ+ కేటగిరీలోకి అన్ని ఫార్మాట్లూ ఆడే ఆటగాళ్లు మాత్రమే వస్తారని తెలుస్తోంది. దీంతో టెస్టులకు గుడ్ బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ టాప్ కేటగిరీలో చోటు కోల్పోయే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి.
Samayam Telugu mahendra singh dhoni may miss out on top bcci contract
ధోనీ చేజారనున్న టాప్ గ్రేడ్ కాంట్రాక్ట్?


రొటేషన్ పాలసీలో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమైన జడేజా, అశ్విన్ లాంటి ఆటగాళ్లను టాప్ కేటగిరీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతుండటాన్ని కమిటీ పరిగణనలో తీసుకోనుండమే దీనికి కారణం అని తెలుస్తోంది.

ఆటగాళ్ల గ్రేడింగ్‌ను సెలక్టర్లు షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. కానీ కమిటీ మార్గదర్శకాల ప్రకారమే వీరు పని చేయనున్నారు. త్వరలో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ బీసీసీ ఆర్థిక సంఘానికి ఆటగాళ్ల గ్రేడింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను అందజేయనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.