యాప్నగరం

ఏబీ డివిలియర్స్ అందుకే రీఎంట్రీకి ఒప్పుకోలేదు: కోచ్ బౌచర్

రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని ఐపీఎల్ 2021 సీజన్‌ వాయిదా పడే వరకూ ఆలోచించిన ఏబీ డివిలియర్స్.. రెండు వారాల వ్యవధిలోనే మనసు మార్చుకున్నాడు. దానికి కారణం ఏంటంటే..?

Samayam Telugu 19 May 2021, 3:36 pm

ప్రధానాంశాలు:

  • రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేందుకు అంగీకరించని ఏబీ డివిలియర్స్
  • ఏబీ మునుపటి నిర్ణయానికి కట్టుబడ్డాడని దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటన
  • 2018 ఐపీఎల్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ఏబీ
  • ఏబీ నిర్ణయం వెనుక అసలు కారణం చెప్పిన కోచ్ బౌచర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu AB de Villiers (Pic Credit: Getty Images)
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీపై ఊహాగానాలకి పూర్తిగా తెరపడింది. 2018లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్.. ఈ ఏడాది ఆ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోవాలని ఆశించాడు. కానీ.. రోజుల వ్యధిలోనే అతను మనసు మార్చుకుని.. మునుపటి రిటైర్మెంట్ నిర్ణయానికే కట్టుబడినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మంగళవారం సాయంత్రం స్పష్టం చేసింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడుతూ రిటైర్మెంట్‌పై పునాలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చిన ఏబీడీ.. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఛాన్స్ ఇచ్చినా వెనక్కి తగ్గడం వెనుక కారణమేంటి..? అని నెటిజన్లు తెగ శోధిస్తున్నారు.
ఏబీ డివిలియర్స్‌ని మొదట రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకునేలా ఒప్పించిన దక్షిణాఫ్రికా టీమ్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్.. ఏబీడీ మనసు మార్చుకోవడంపై తాజాగా స్పందించాడు. ‘‘ఒక కారణంతో ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ కారణాన్ని మేము గౌరవిస్తున్నాం. 37 ఏళ్ల ఏబీ డివిలియర్స్ ఇక ఎంతో కాలం టీమ్‌కి ఆడలేడు. నిజమే.. అతను టీ20ల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. కానీ.. ఏబీడీ ఒకటే ఆలోచించాడు. జట్టు ప్రణాళికల్లో భాగంగా టీమ్‌లోకి వచ్చిన ఆటగాళ్ల ఛాన్స్‌ని తాను తీసుకోకూడదని భావించాడు. ఆ నిర్ణయాన్ని మేము అర్థం చేసుకోగలం’’ అని బౌచర్ చెప్పుకొచ్చాడు.

షెడ్యూల్ ప్రకారం భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఒకవేళ ఏబీ డివిలియర్స్ టీమ్‌లో ఉంటే..? కచ్చితంగా అతడ్ని ఆడించకుండా రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టే సాహసం దక్షిణాఫ్రికా చేయబోదు. అదే జరిగితే.. ఇన్నాళ్లు జట్టులో ఉన్న ఒక యువ ఆటగాడు రిజర్వ్ బెంచ్‌కి పరిమితం కావాల్సి వస్తుంది. ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు.. టీమ్‌ గురించి అతను ఏమాత్రం ఆలోచించకుండా ప్రైవేట్ టీ20ల్లో ఆడేందుకు స్వార్థంగా ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేసినట్లు మాజీ క్రికెటర్లు విమర్శించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.