యాప్నగరం

ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీలో మార్పు.. తెరపైకి కొత్త పేరు

భారత్‌పై రెండు వన్డేల్లోనూ మెరుపు ఆరంభాల్నిచ్చిన డేవిడ్ వార్నర్.. ఆ టీమ్ భారీ స్కోరుకి బాటలు వేశాడు. కానీ.. మూడో వన్డేకి అతను దూరమయ్యాడు. దాంతో.. అరోన్ ఫించ్‌కి జోడీగా..?

Samayam Telugu 1 Dec 2020, 8:43 am
భారత్‌తో బుధవారం జరగనున్న మూడో వన్డేకి ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీలో మార్పు జరగబోతోంది. సిడ్నీ వేదికగా గత ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు. అతని గజ్జలో గాయాన్ని పరిశీలించిన వైద్యులు.. రెస్ట్ ఇవ్వాలని సూచించడంతో.. అతడ్ని వన్డే, టీ20 జట్టు నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తప్పించింది. ఆ వెంటనే అతని స్థానంలో డీఆర్క్ షార్ట్‌ని టీమ్‌లోకి ఎంపిక చేసింది. దాంతో.. మూడో వన్డేకి అరోన్ ఫించ్‌తో కలిసి ఎవరు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ని ఆరంభిస్తారు..? అనే చర్చ మొదలైంది.
Samayam Telugu ​Marnus Labuschagne
Marnus Labuschagne. (Photo by Ashley Vlotman/Gallo Images/Getty Images)


కాన్‌బెర్రా వేదికగా బుధవారం ఉదయం 9.10 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీపై ఆ దేశ మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఓ సూచన చేశాడు. గత రెండేళ్లుగా నిలకడగా రాణిస్తున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మార్కస్ లబుషేన్‌ని డేవిడ్ వార్నర్ స్థానంలో ఓపెనర్‌గా పంపాలని హగ్ సూచించాడు. తొలి వన్డేలో 2 పరుగులు మాత్రమే చేసిన లబుషేన్.. రెండో వన్డేలో 70 పరుగులతో మళ్లీ టచ్‌లోకి వచ్చాడు.

తొలి వన్డేలో 76 బంతుల్లో 68 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. రెండో వన్డేలో 77 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ మరో ఓపెనర్ అరోన్ ఫించ్‌తో కలిసి తొలి వికెట్‌కి 156, 142 పరుగుల భాగస్వామ్యాల్ని వార్నర్ నెలకొల్పాడు. దాంతో.. తొలి వన్డేలో 374 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. రెండో వన్డేలో ఏకంగా 389 పరుగుల్ని చేయగలిగింది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలోనూ మెరుగైన ఆరంభాన్ని ఆస్ట్రేలియా కోరుకుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.