యాప్నగరం

ఖాళీ స్టేడియంలో మ్యాచ్‌.. వధువులేని పెళ్లి లాంటిదే: అక్తర్

కరోనా వైరస్ వ్యాప్తితో అన్ని చోట్లా సామాజిక దూరం పాటించాలని సూచిస్తుండగా.. క్రికెట్ స్టేడియంలో అది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. దాంతో.. ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్‌లను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.

Samayam Telugu 18 May 2020, 8:53 pm
కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాదంతా ఖాళీ స్టేడియాల్లోనే క్రికెట్ మ్యాచ్‌‌లు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే క్రికెట్‌ కళ తప్పడం ఖాయమని అభిప్రాయపడిన పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. వధువులేని పెళ్లి‌లా ఆ మ్యాచ్‌లు ఉంటాయని ఎద్దేవా చేశాడు. కరోనా వైరస్ వ్యాప్తితో మార్చి నుంచే క్రికెట్ సిరీస్‌లన్నీ రద్దవగా.. జూన్ నుంచి తిరిగి ప్రారంభయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Samayam Telugu Thiruvananthapuram: The Greenfield International Cricket Stadium being readied f...


‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడమే సమంజసం. కానీ.. క్రికెట్‌ బోర్డులకి అది మునుపటిలా ఆదాయం తెచ్చిపెట్టదు. ఆ సిరీస్‌లకి మార్కెట్‌ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. స్టేడియంలో ప్రేక్షకులు లేని మ్యాచ్‌ అంటే వధువు లేని వివాహంలా ఉంటుంది. కరోనా బాధిత దేశాల్లో ఏడాదిలోపు పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది’’ అని అక్తర్ వెల్లడించాడు.

కరోనా వైరస్ కట్టడికి ఫండ్స్ కోసం భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవల ద్వైపాక్షిక సిరీస్‌ని ప్రతిపాదించిన షోయబ్ అక్తర్ నవ్వులపాలయ్యాడు. ఫండ్స్ కోసం పాక్‌తో సిరీస్‌ ఆడాల్సిన అవసరం ప్రస్తుతం భారత్‌కి లేదని మాజీ క్రికెటర్లు చురకలు వేయగా.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ల నుంచి కూడా అతనికి మద్దతు లభించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.