యాప్నగరం

కరోనా నెగటివ్.. ఊపిరి పీల్చుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్

మొర్తజా ఎట్టకేలకి కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి రెండు వారాలు చికిత్స తీసుకున్న అతనికి ఈ నెల ఆరంభంలో మరోసారి పాజిటివ్‌గా వచ్చింది. దాంతో.. ట్రీట్‌మెంట్‌ని కొనసాగించిన ఈ బంగ్లా క్రికెటర్‌..

Samayam Telugu 15 Jul 2020, 6:55 am
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్రఫె మొర్తజా‌కి ఎట్టకేలకి కరోనా నెగటివ్‌ వచ్చింది. జూన్ 20న తాను కరోనా వైరస్ బారినపడినట్లు స్వయంగా వెల్లడించిన ఈ బంగ్లా క్రికెటర్.. ఇంటి వద్దే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో.. జులై తొలి వారంలో కోలుకున్నట్లు కనిపించడంతో కరోనా టెస్టులు చేయించుకోగా మళ్లీ పాజిటివ్ వచ్చింది. దానికి తోడు.. ఇంట్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. మొర్తజా భార్య, అతని సోదరుడికి కూడా కరోనా వైరస్ సోకింది.
Samayam Telugu Mashrafe Mortaza
Mashrafe Mortaza (Getty Images)


కరోనా పరీక్షల్లో తాజాగా తనకి నెగటివ్ వచ్చినట్లు వెల్లడించిన మొర్తజా.. తన భార్య‌కి మాత్రం ఇంకా ట్రీట్‌మెంట్ కొనసాగుతున్నట్లు వెల్లడించాడు. క్లిష్ట పరిస్థితుల్లో తన కోసం ప్రార్థించిన వారికి థ్యాంక్స్ చెప్పిన ఈ బంగ్లా మాజీ కెప్టెన్.. ఇప్పుడు తన భార్య కోసం ప్రార్థనలు చేయాలని అభిమానులకి విన్నవించాడు. బంగ్లాదేశ్‌లో ఇప్పటికే 1,90,057 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

బంగ్లాదేశ్‌ మెరుగైన ఫాస్ట్ బౌలర్‌గా కితాబులు అందుకున్న మొర్తజా.. 36 టెస్టులాడి 78 వికెట్లు, 220 వన్డేలాడి 270 వికెట్లు పడగొట్టాడు. అలానే 54 టీ20ల్లో 42 వికెట్లు తీశాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా ఊహించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అతనికి వీడ్కోలు మ్యాచ్ కూడా ఏర్పాటు చేసింది. కానీ.. తాను ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించబోనని మొర్తజా మొండికేస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.