యాప్నగరం

ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్‌కి తీవ్ర గాయాలు..!

2009లో సిడ్ని వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో 16 ఏళ్ల కెరీర్‌కి హెడెన్‌ వీడ్కోలు పలికాడు.

Samayam Telugu 8 Oct 2018, 1:01 pm
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్‌‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్యామిలీతో కలిసి క్వీన్స్‌లాండ్ దీవులకి ఇటీవల హాలిడే ట్రిప్‌కి వెళ్లిన ఈ ఓపెనర్ అక్కడ తన కొడుకుతో కలిసి సరదాగా సర్ఫింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు పట్టుజారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో తన తల బోటుకి బలంగా ఢీకొనడంతో.. తీవ్రగాయాలైనట్లు అతనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తాజాగా తెలియజేశాడు. స్కానింగ్‌లో హెడెన్ తల, మెడలోని సీ6, సీ5, సీ4 లిగమెంట్స్ విరిగినట్లు తేలింది.
Samayam Telugu 100


ఇంగ్లాండ్‌పై 1993లో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మాథ్యూ హెడెన్ సుదీర్ఘకాలం ఆస్ట్రేలియా ఓపెనర్‌గా తిరుగులేని స్థాయిలో రాణించాడు. కెరీర్‌లో 103 టెస్టులాడిన ఈ దిగ్గజ ఆటగాడు.. రెండు ద్విశతకాలు, 30 శతకాలతో పాటు 29 అర్ధశతకాలు నమోదు చేశాడు. 161 వన్డేల్లో 10 శతకాలు, 36 అర్ధశతకాలు సాధించాడు. ఇక టీ20ల్లో ఆడిన 9 మ్యాచ్‌ల్లోనే 4 అర్ధశతకాలు బాదడం అతని దూకుడుకి నిదర్శనం. 2009లో సిడ్ని వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో 16 ఏళ్ల కెరీర్‌కి హెడెన్‌ వీడ్కోలు పలికాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.