యాప్నగరం

దేశవాళీ క్రికెట్‌లో మయాంక్ పరుగుల వరద..!

దేశవాళీ క్రికెట్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు. సౌరాష్ట్రతో మంగళవారం జరుగుతున్న విజయ్

TNN 27 Feb 2018, 12:00 pm
దేశవాళీ క్రికెట్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు. సౌరాష్ట్రతో మంగళవారం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ (90: 79 బంతుల్లో 11x4, 3x6) అర్ధశతకం బాది ఓ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. కర్ణాటకకి చెందిన ఈ యువ ఓపెనర్ 2017-18 సీజన్‌లో అసాధారణ ఫామ్‌ని కొనసాగిస్తూ ఇప్పటికే 2,000 పరుగులు పూర్తి చేశాడు.
Samayam Telugu mayank agarwal becomes highest run scorer in an indian domestic season
దేశవాళీ క్రికెట్‌లో మయాంక్ పరుగుల వరద..!


దేశవాళీ క్రికెట్‌లో ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఇప్పటి వరకు శ్రేయాస్ అయ్యర్ 1,947 పరుగులతో ఉన్నాడు. అతను 2015-16 సీజన్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. తాజాగా ఆ రికార్డ్‌ని మయాంక్ అగర్వాల్ కనుమరుగు చేసి అగ్రస్థానానికి ఎగబాకాడు. మూడో స్థానంలో వసీం జాఫర్ ఉన్నాడు. అతను 2008-2009 సీజన్‌లో 1,907 పరుగులు చేశాడు.

ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో చోటు సంపాదించగా.. ఇటీవల ముక్కోణపు టీ20 సిరీస్‌‌కి ప్రకటించిన జట్టులో మయాంక్ అగర్వాల్‌కి చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ.. సెలక్టర్లు ఈ యువ ఓపెనర్‌కి మొండిచేయి చూపారు. శ్రీలంక వేదికగా మార్చి 6 నుంచి జరగనున్న ఈ టోర్నీకి కోహ్లి, ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్, బుమ్రా, చాహల్‌కి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. యువ క్రికెటర్లకి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.