యాప్నగరం

సచిన్ కంటే ఆ హైదరాబాదీ క్రికెటర్ అంటేనే ఇష్టం: సత్య నాదెళ్ల

నేను హైదరాబాదీని, నాకు సచిన్ కంటే ఆ హైదరాబాదీ క్రికెటర్ అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పిన సత్య నాదెళ్ల.

TNN 7 Nov 2017, 3:28 pm
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మెచ్చిన క్రికెటర్ ఎవరో తెలుసా? క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కంటే ఆయనకు హైదరాబాదీ క్రికెటర్ అంటేనే ఇష్టమట. 1960ల నాటి ఆటగాడైన జయసింహ తనకెంతో ఇష్టమైన క్రికెటర్ అని సత్య తెలిపారు. ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జయసింహ, సచిన్ టెండుల్కర్‌.. వీరిద్దరిలో నీ ఫేవరెట్ ఎవరనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. కష్టమైన ప్రశ్నే వేశారు. కానీ నేను హైదరాబాదీని కాబట్టి నా ఓటు జయసింహకే అని తెలిపారు.
Samayam Telugu microsoft ceo satya nadella picks hyderabad legend over sachin tendulkar as his favorite cricketer
సచిన్ కంటే ఆ హైదరాబాదీ క్రికెటర్ అంటేనే ఇష్టం: సత్య నాదెళ్ల


తను రాసిన హిట్ రిఫ్రెష్ పుస్తకంలో సత్య నాదెళ్ల జయసింహ గురించి ప్రస్తావించారు. ఓసారి వాళ్ల తన గదిలో కార్ల్ మాక్స్ పోస్టర్ వేలాడదీశాడని, దీంతో వాళ్లమ్మ వచ్చి లక్ష్మీ దేవి ఫొటోను గోడకు తగిలించిందని చెప్పాడు. దీనికి బదులుగా తను ఇష్టమైన ఆటగాడైన జయసింహ ఫొటోను ఉంచానని చెప్పారు. చిన్నపిల్లాడిలా కనిపించే ఈ హైదరాబాదీ క్రికెటర్ అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. అతడి స్టయిల్ నాకెంతో నచ్చుతుందన్నారు.

సికింద్రాబాద్‌లో జన్మించిన జయసింహ 1959-1971 మధ్య 39 టెస్టుల్లో భారత్‌‌కు ప్రాతినిధ్యం వహించారు. 2056 పరుగులు చేశారు. ఆయన చాలా స్టయిలిష్‌గా బ్యాటింగ్ చేసేవారు. తర్వాతి తరంలో అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి హైదరాబాదీ క్రికెటర్లు ఆయన మణికట్టు శైలిని అనుసరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.