యాప్నగరం

India vs Australia: భారత్‌తో సిరీస్‌ కోసం ఆసీస్ టీమ్ ప్రకటన

గాయం కారణంగా ఆ జట్టు అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ టూర్‌కి దూరమవగా.. అతని స్థానంలో కేన్ రిచర్డ్‌సన్‌‌కి అవకాశం దక్కింది. రిచర్డ్‌సన్ గత ఏడాది జూన్ 27న ఆఖరిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు.

Samayam Telugu 7 Feb 2019, 11:01 am
భారత్‌తో ఈనెల ఆఖర్లో ప్రారంభంకానున్న సుదీర్ఘ సిరీస్‌ కోసం 16 మందితో కూడిన జట్టుని ఆస్ట్రేలియా తాజాగా ప్రకటించింది. ఈనెల 24న విశాఖపట్నం వేదికగా తొలి టీ20తో ప్రారంభంకానున్న ఈ సిరీస్‌లో మార్చి 13 వరకూ మొత్తం రెండు టీ20లు, ఐదు వన్డేలను ఆస్ట్రేలియా ఆడనుంది.
Samayam Telugu 4


గాయం కారణంగా ఆ జట్టు అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ టూర్‌కి దూరమవగా.. అతని స్థానంలో కేన్ రిచర్డ్‌సన్‌‌కి అవకాశం దక్కింది. రిచర్డ్‌సన్ గత ఏడాది జూన్ 27న ఆఖరిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లిన భారత్ జట్టు దాదాపు 72ఏళ్ల నిరీక్షణ తర్వాత టెస్టు సిరీస్‌ని గెలవడంతో పాటు వన్డే సిరీస్‌నూ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా కెప్టెన్‌గా అరోన్ ఫించ్ మరోసారి ఎంపికవగా.. షాన్ మార్ష్ తన భార్య ప్రసవానంతరం టూర్ మధ్యలో టీమ్‌తో చేరుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. అప్పటి వరకూ అతని స్థానంలో డీఆర్క్ షార్ట్ జట్టుతో ఉండనున్నాడు.

ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), బెరెండ్రాఫ్, కౌల్టర్ నైల్, పీటర్ హ్యాండ్స్‌కబ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లయన్, షాన్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, జీ రిచర్డ్‌సన్, కేన్ రిచర్డ్‌సన్, మార్కస్ స్టాయినిస్, ఆస్టన్ టర్నర్, ఆడమ్ జంపా, డీఆర్క్‌షార్ట్ (షాన్‌మార్ష్‌కి ప్రత్యామ్నాయం)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.