యాప్నగరం

లార్డ్స్‌లోనే మిథాలీ, జులన్ జెర్సీలు..!

లార్డ్స్‌లో ఈ ప్రపంచకప్ ఫైనల్‌ వీరికి చివరి మ్యాచ్‌ని భావించే జెర్సీలను అందజేసినట్లు తెలుస్తోంది.

TNN 25 Jul 2017, 1:30 pm
భారత మహిళా జట్టుకి దశాబ్దానికిపైగా ప్రాతినిథ్యం వహిస్తూ జట్టు విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న కెప్టెన్ మిథాలీ రాజ్, వెటరన్ బౌలర్ జులన్ గోస్వామికి అరుదైన గౌరవం దక్కింది. ఇంగ్లాండ్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ స్టేడియంలోని మ్యూజియంలో ఈ ఇద్దరి క్రికెటర్ల జెర్సీలను ప్రదర్శనకి ఉంచనున్నారు. ఆదివారం లార్డ్స్‌లోనే ముగిసిన ప్రపంచకప్ ఫైనల్ అనంతరం తాము ధరించిన జెర్సీలపై సంతకం చేసి మిథాలీ రాజ్, జులన్ గోస్వామి మ్యూజియం సిబ్బందికి వాటిని అందజేసినట్లు ఐసీసీ వెల్లడించింది.
Samayam Telugu mithali raj jhulan goswami donate their signed match jerseys to lords museum
లార్డ్స్‌లోనే మిథాలీ, జులన్ జెర్సీలు..!


భారత మహిళా క్రికెట్‌‌కి ఆదరణ తెచ్చిన ఈ క్రికెటర్లు.. ఇక కెరీర్‌లో మరో ప్రపంచకప్ ఆడే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలేమో. ఇప్పటికే 33 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో.. ఫిటెనెస్ దృష్ట్యా మరో నాలుగేళ్లు ఆటలో కొనసాగడం కష్టం. కాబట్టి లార్డ్స్‌లో ఈ ప్రపంచకప్ ఫైనల్‌ వీరికి చివరి మ్యాచ్‌ని భావించే జెర్సీలను అందజేసినట్లు తెలుస్తోంది. లార్డ్స్ వేదికగా ఆదివారం ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 9 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.