యాప్నగరం

టీమిండియాకి కోచ్..? వెనక్కి తగ్గను

భారత పురుషుల క్రికెట్ జట్టుకి ఒకవేళ తనని కోచ్‌గా నియమిస్తే.. వెనక్కి తగ్గకుండా అత్యుత్తమంగా పనిచేస్తానని భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ

TNN 2 Jan 2018, 6:39 pm
భారత పురుషుల క్రికెట్ జట్టుకి ఒకవేళ తనని కోచ్‌గా నియమిస్తే.. వెనక్కి తగ్గకుండా అత్యుత్తమంగా పనిచేస్తానని భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించారు. ఓ టీవీ ‘షో’లో భాగంగా బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ అడిగిన ప్రశ్నకి మిథాలీ పైవిధంగా సమాధానమిచ్చారు. గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత మహిళల జట్టు ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే.
Samayam Telugu mithali raj reveals how she deals with match pressure
టీమిండియాకి కోచ్..? వెనక్కి తగ్గను


‘మైదానంలో ఎప్పుడూ కూల్‌గా ఉంటారు.. ఎలా సాధ్యం..?’, ‘నాకు మిమ్మల్ని భారత పురుషుల క్రికెట్ జట్టుకి కోచ్‌గా చూడాలని ఉంది’ అని షారూక్ సరదాగా మిథాలీని అడిగారు. ‘మ్యాచ్ సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు నేను పుస్తకాలు చదువుతా. బుక్స్ నాలో ప్రశాంతతని పెంచి.. మెరుగైన ప్రదర్శన చేసేందుకు దోహదపడతాయి. ఇక భారత పురుషుల క్రికెట్ జట్టుకి కోచ్‌గా అంటారా..? ఒకవేళ అవకాశం దొరికితే అత్యుత్తమంగా పనిచేస్తా’ అని మిథాలీ ధీమా వ్యక్తం చేశారు. ఈ షో జనవరి 7న స్టార్ ప్లస్‌లో ప్రసారంకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.