యాప్నగరం

అమ్మాయిలూ.. అక్కడ ఆస్ట్రేలియా జట్టు

లీగ్ దశలో ఒక మ్యాచ్ మినహా జట్టు ఓపెనర్లు మెరుగైన ఆరంభం ఇవ్వలేకపోయారు. ఫీల్డింగ్‌లో కూడా

TNN 19 Jul 2017, 8:01 pm
ఐసీసీ మహిళల ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి సెమీస్ చేరిన భారత్ జట్టు డర్బీ వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఇప్పటికే ఒకసారి ఆ జట్టు చేతిలో ఘోర పరాజయం చవిచూసిన భారత్ జట్టుకి కెప్టెన్ మిథాలీ రాజ్ హెచ్చరికలు జారీ చేసింది. డర్బీ మైదానంలో ఇప్పటికే భారత్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆసీస్ కంటే భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని మిథాలీ ధీమా వ్యక్తం చేసింది.
Samayam Telugu mithali raj warns team against defending champions
అమ్మాయిలూ.. అక్కడ ఆస్ట్రేలియా జట్టు


‘ఆస్ట్రేలియా బలమైన జట్టే. గత ప్రపంచకప్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి సెమీస్ చేరింది. ఆ జట్టులో ఒత్తిడిని తట్టుకుని ఆడగలిగే క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. కానీ.. సెమీస్ జరిగే డర్బీ మైదానంలో ఇప్పటికే మేము కొన్ని మ్యాచ్‌లు ఆడాం. ఆ పిచ్‌ స్పందించే తీరుపై మాకు చక్కటి అవగాహన ఉంది. పరిస్థితులకి అనుగుణంగా జట్టు‌ ఆడగలిగితే విజయం భారత్‌దే’ అని మిథాలీ రాజ్ వెల్లడించింది. లీగ్ దశలో ఒక మ్యాచ్ మినహా జట్టు ఓపెనర్లు మెరుగైన ఆరంభం ఇవ్వలేకపోయారు. ఫీల్డింగ్‌లో కూడా చిన్నచిన్న తప్పిదాలు.. మిడిలార్డర్ తడబాటు కొనసాగింది. కనీసం సెమీస్‌లోనైనా.. క్రికెటర్లు తప్పులు సరిదిద్దుకోవాలని మిథాలీ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.