యాప్నగరం

డ్యాన్సర్‌ అవ్వాలనుకుని.. క్రికెటరైంది..!

చిన్న వయసులో మిథాలీ రాజ్ డ్యాన్సర్ అవ్వాలని ఆశపడింది. కానీ.. కాలం ఆమెని క్రికెటర్‌గా మార్చింది. మహిళల క్రికెట్లో

TNN 15 Jul 2017, 2:40 pm
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ తొలుత డ్యాన్సర్ అవ్వాలనుకుని.. అనూహ్యంగా క్రికెటర్‌గా మారిందని ఆమె తండ్రి దొరై రాజ్ వెల్లడించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో వన్డేల్లో 6వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక క్రికెటర్‌గా మిథాలీ రాజ్ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మిథాలీ రాజ్ చిన్ననాటి విషయాలను ఆమె తండ్రి మీడియాతో పంచుకున్నారు.
Samayam Telugu mithali raj was keen on becoming a dancer says father dorai raj
డ్యాన్సర్‌ అవ్వాలనుకుని.. క్రికెటరైంది..!


‘చిన్న వయసులో మిథాలీ రాజ్ డ్యాన్సర్ అవ్వాలని ఆశపడింది. కానీ.. కాలం ఆమెని క్రికెటర్‌గా మార్చింది. మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు‌ని మిథాలీ అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. కష్టించేతత్వం, నిబద్ధతతోనే తను ఈ మైలురాయిని అందుకోగలిగింది. ప్రస్తుతం చాలా మంది మహిళా క్రికెటర్లకి మిథాలీ రాజ్ రోల్‌మోడల్‌గా మారింది’ అని దొరై రాజ్ ఆనందం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.