యాప్నగరం

ప్రపంచకప్‌లో అలా వికెట్లు పడితే ఎలా..?

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వాస్తవంగా మేము కొన్ని తప్పిదాలను అంగీకరించాల్సిందే. ఆదిలోనే టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా వికెట్లు

TNN 4 Jul 2017, 5:19 pm
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో భారత్ జట్టు సెమీస్ దిశగా దూసుకెళ్తోంది. వరుసగా ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లను మట్టికరిపించిన భారత్.. శుక్రవారం శ్రీలంకతో తలపడనుంది. టోర్నీ ఆరంభం నుంచి బౌలింగ్‌లో మెరుగ్గా రాణిస్తున్న జట్టు.. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో తడబడుతోంది. ఓపెనర్లు స్మృతి మందాన‌, పూనమ్ రౌత్, కెప్టెన్ మిథాలీ రాజ్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడం లేదు. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాక్‌తో మ్యాచ్‌లో మందాన విఫలమైతే.. భారత్ ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో కీలకమైన శ్రీలంకతో మ్యాచ్‌లో భాగస్వామ్యాలపై దృష్టి కేంద్రీకరిస్తామని కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించారు.
Samayam Telugu mithali raj yearns for improvement in indias batting ahead of sri lanka clash
ప్రపంచకప్‌లో అలా వికెట్లు పడితే ఎలా..?


‘పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వాస్తవంగా మేము కొన్ని తప్పిదాలను అంగీకరించాల్సిందే. ఆదిలోనే టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ ప్రభావం జట్టు ప్రదర్శనపై పడింది. అందుకే సెమీస్‌కి ముందు శ్రీలంకతో మ్యాచ్‌లో భాగస్వామ్యాలు నిర్మించడంపై దృష్టి కేంద్రీకరిస్తాం. పాక్‌తో మ్యాచ్‌లో స్పిన్నర్లు అద్భతంగా బౌలింగ్ చేశారు. పేసర్లు టోర్నీ ఆరంభం నుంచి పదునైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు’ అని మిథాలీ రాజ్ సంతోషం వ్యక్తం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.