యాప్నగరం

MSK Prasad: రాయుడి వివాదం.. చీఫ్ సెలెక్టర్ వివరణ సంతృప్తికరంగా లేదు: అజ్జూ

వరల్డ్ కప్ జట్టులో అంబటి రాయుడికి చోటు కల్పించకపోవడం పట్ల మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించారు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణతో తాను సంతృప్తి చెందనన్నారు. రాయుడిని ఎంపిక చేయకపోవడం బాధగా ఉందన్నారు.

Samayam Telugu 24 Jul 2019, 2:35 pm

ప్రధానాంశాలు:

  • వరల్డ్ కప్ జట్టులో అంబటి రాయుడికి చోటు కల్పించకపోవడం పట్ల మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించారు.
  • చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ సంతృప్తికరంగా లేదన్నారు.
  • రాయుడిని ఎంపిక చేయకపోవడం బాధగా ఉందన్నారు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu pjimage - 2019-07-03T212659.953
అంబటి రాయుడు క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు, వరల్డ్ కప్ ముగిసింది కానీ రాయుడి రిటైర్మెంట్ వివాదం మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. రాయుడుకి ప్రపంచ కప్ జట్టులో స్థానం కల్పించకపోవడం పట్ల మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించారు. వరల్డ్ కప్ టోర్నీలో నాలుగో స్థానానికి రాయుడిని ఎంపిక చేస్తారని భావించారు. కానీ సెలెక్టర్లు త్రీడీ ఆటగాడనే కారణంతో విజయ్ శంకర్‌కు అవకాశం ఇచ్చిన సెలెక్టర్లు రాయుణ్ని పక్కనబెట్టారు. తర్వాత స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయపడిన తర్వాత రాయుడిని కాదని మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయడం పట్ల అజారుద్దీన్ స్పందించారు.
స్టాండ్ బైగా ఉన్న రాయుణ్నే తప్పకుండా ఎంపిక చేయాల్సిందని అజ్జూ అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఆటగాణ్ని రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించాల్సిన అవసరం తలెత్తినప్పుడు.. సెలెక్టర్లు కెప్టెన్, కోచ్ ఇష్టపూర్వకంగా కాకుండా.. లేదు మేం కచ్చితంగా ఈ ఆటగాడినే పంపుతామని ఎమ్మెస్కే ప్రసాద్‌ను ఉద్దేశించి అజారుద్దీన్ కామెంట్ చేశారు. కెప్టెన్, కోచ్ ఇష్టం మేరకే మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశామని ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చిన తరుణంలో అజ్జూ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కొందరు ఆటగాళ్లు జట్టులో ఉండాలని కోరుకున్నాను. కానీ సెలెక్టర్లు కుదరదని తేల్చి చెప్పారు. రాయుణ్ని ఎంపిక చేయకపోవడం బాధగా ఉంది. కానీ ఎమ్మెస్కే ప్రసాద్ ఇచ్చిన వివరణతో నేను ఏకీభవించనని అజారుద్దీన్ తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తానని అజ్జూ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.