యాప్నగరం

Asia Cup 2022 కి అఫ్గానిస్థాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా నబీ ఎంపిక

Afghanistan squad For Asia Cup 2022 కి కెప్టెన్‌గా రషీద్ ఖాన్ ఎంపికవుతాడని అంతా ఊహించారు. కానీ మహ్మద్ నబీ చేతికే అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు పగ్గాలప్పగించింది. చివరికి కనీసం వైస్ కెప్టెన్‌గా కూడా రషీద్ ఖాన్‌ని ఎంపిక చేయలేదు. ఆసియా కప్‌లో రషీద్ ఖాన్ చెలరేగుతాడని అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. దాంతో అతనికి అదనపు బాధ్యతలు అప్పగించి ఒత్తిడికి గురి చేయకూడదనే అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు అతడ్ని బౌలర్‌గా మాత్రమే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 16 Aug 2022, 7:34 pm

ప్రధానాంశాలు:

  • ఈ నెల 27 నుంచి ఆసియా కప్ మొదలు
  • 17 మందితో అఫ్గానిస్థాన్ టీమ్ ప్రకటన
  • కెప్టెన్‌గా ఎంపికైన మహ్మద్ నబీ
  • రషీద్ ఖాన్‌ని కేవలం బౌలర్‌గా మాత్రమే ఎంపిక
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Afghanistan Squad for Asia Cup 2022 (Pic Source: Twitter)
అఫ్గానిస్థాన్ టీమ్ (Pic Source: Twitter)
యూఏఈ ఆతిథ్యం ఇవ్వబోతున్న ఆసియా కప్ 2022 కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ఈరోజు జట్టుని ప్రకటించింది. 17 మందితో కూడిన ఈ జట్టుకి కెప్టెన్‌గా మహ్మద్ నబీ ఎంపికయ్యాడు. అతని కెప్టెన్సీలో ఇటీవల ఐర్లాండ్ టూర్‌లో అఫ్గానిస్థాన్ టీమ్ సత్తాచాటింది. దాంతో మరోసారి అతని చేతికే ఏసీబీ పగ్గాలప్పగించింది.
భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌తో పాటు ఒక క్వాలిఫయర్ టీమ్ కూడా ఈ ఆసియా కప్‌ 2022లో పోటీపడనుంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకూ ఆసియా కప్ 2022 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే భారత్, పాకిస్థాన్ సెలెక్టర్లు కూడా జట్లని ప్రకటించేశారు. ఆసియా కప్‌లో భారత్ ఏడుసార్లు విజేతగా నిలవగా.. శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు టైటిల్ గెలిచాయి. కానీ.. అఫ్గానిస్థాన్ ఇప్పటి వరకూ విజేతగా నిలవలేదు.

ఆసియా కప్‌ 2022కి అఫ్గానిస్థాన్ టీమ్ ఇదే: మహ్మద్ నబీ (కెప్టెన్), నజీబుల్లా జార్దాన్ (వైస్ కెప్టెన్), అప్సర్ జజాయ్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్‌జాయ్, పరీద్ అహ్మద్ మాలిక్, ఫజల్ హక్ ఫరూక్, హస్మతుల్లా షాహిదీ, హజ్రతుల్లా జజాయ్, ఇబ్రహీం జర్దాన్, కరీమ్ జనత్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నజీబుల్లా జర్దాన్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), రషీద్ ఖాన్, సమీవుల్లా సిన్వారి.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.