యాప్నగరం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహ్మద్ షమీ

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆదివారం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో షమీ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

TNN 25 Mar 2018, 11:14 am
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆదివారం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో షమీ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ నుంచి షమీ క్షేమంగా బయటపడ్డాడు. కానీ అతడి తలకు గాయాలయ్యాయి. డెహ్రాడూన్‌లోని ఆసుపత్రిలో చేరగా.. అతడి తలకు కుట్లు వేసిన డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఒకట్రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు. షమీ ప్రయాణిస్తోన్న కారును లారీ ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
Samayam Telugu shami


కొద్ది రోజుల క్రితం షమీ భార్య హసీన్ జహాన్ అతడిపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. అతడికి అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ కోల్‌కతాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుబాయ్‌లో పాకిస్థానీ మహిళతో గడిపాడని ఆరోపించింది. దీంతో బీసీసీఐ అతడికి కాంట్రాక్ట్ నిలిపేసింది. అతడిపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలు నిజం కాదని తెలియడంతో క్రికెట్ బోర్డ్ ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్ట్‌లో అతడికి స్థానం కల్పించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.