యాప్నగరం

వాళ్ల అన్నతో శారీరక సంబంధం పెట్టుకోమని..: షమీ భార్య

మేమిద్దరం గది బయట ఉండగా.. షమీ తను నాతో ఈ విషయం చెప్పాడు. వాళ్ల అన్నయ్య హసీబ్ గదిలో ఉన్నాడు. షమీ నన్ను ఆ గదిలోకి తోసి తాళం వేశాడు.

TNN 10 Mar 2018, 3:49 pm
‘షమీకి చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి నన్ను చంపడానికి కూడా యత్నించాడ’ని అతడి భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆమె పోలీస్ స్టేషన్‌లో షమీపై కేసు కూడా నమోదు చేసింది. భారత పేస్ బౌలర్‌తోపాటు నలుగురు కుటుంబ సభ్యులపై కూడా కోల్‌కతాలోని జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Samayam Telugu mohammed shami wanted me to have physical relations with his brother
వాళ్ల అన్నతో శారీరక సంబంధం పెట్టుకోమని..: షమీ భార్య


ఇక్కడితో ఆగని హసీన్.. విదేశాల్లో పర్యటించే సమయంలో షమీకి సెక్స్ వర్కర్లతో సంబంధాలు ఉండేవని ఆరోపించింది. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని చెప్పింది. అంతే గాకుండా.. షమీ వాళ్ల అన్నయ్యతో శారీరక సంబంధం పెట్టుకోమని క్రికెటర్ తనను బలవంతం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది.

‘వాళ్ల అన్నయ్య హసీబ్ గదిలో ఉన్నాడు. మేమిద్దరం గది బయట ఉండగా.. షమీ నాతో ఈ విషయం చెప్పాడు. షమీ నన్ను ఆ గదిలోకి తోసి తాళం వేశాడు. హసీబ్ నాతో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. కానీ నేను కేకలు వేయడంతో షమీ తలుపు తెరిచాడ’ని హసీనా మీడియాకు తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.