యాప్నగరం

Andrew Symonds మంకీ గేట్ వివాదం.. అప్పట్లో తీవ్ర దూమారం

మాజీ ఆసీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కెరీర్‌లో మంకీ గేట్ వివాదం ఓ చేదు అనుభవంగా మిగిలిపోయింది. 2008లో సిడ్నీలో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌తో గొడవ అప్పట్లో తీవ్ర దూమారం రేపింది. ఈ వివాదం తరువాతే తాను మద్యానికి బానిస అయ్యాయని సైమండ్స్ చెప్పుకున్నారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 15 May 2022, 6:08 am
కెరీర్‌లో ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించిన ఆండ్రూ సైమండ్స్ పేరు వినగానే మనకు మొదట గుర్తొచ్చేది 'మంకీ గేట్' వివాదం. 2008లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా భారత స్పిన్నర్ హర్భజన్, సైమండ్స్ మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని క్రికెట్ అభిమానులు ఎవరు అంతా ఈజీగా మార్చిపోయి ఉండరు. తన కెరీర్‌ను 'మంకీ గేట్' వివాదమే నాశనం చేసిందని ఓ సందర్భంలో సైమండ్స్ చెప్పుకున్నారు.
Samayam Telugu Monkeygate Incident: ఆండ్రూ సైమండ్స్


2008లో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో సైమండ్స్‌ను హర్భజన్ సింగ్ కోతితో పోల్చడం అప్పట్లో తీవ్ర దూమారం రేపింది. జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని భజ్జీపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది. అయితే భజ్జీపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. మొత్తం సిరీస్‌నే బహిష్కరిస్తామని టీమిండియా ఆటగాళ్లు హెచ్చరించడంతో సీఏ దిగివచ్చింది. భజ్జీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ వివాదంపై గతంలో ఆండ్రూ సైమండ్స్ స్పందిస్తూ.. ఆ వివాదమే తన కెరీర్‌ను నాశనం చేసిందని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో భజ్జీ తనను మంకీ అంటూ గెలీ చేశాడని చెప్పారు. మంకీ గేట్ వివాదం జాతి వివక్ష వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని చెప్పుకొచ్చారు. అయితే తమ జట్టు అనవసరంగా ఈ విషయాన్ని పెద్దదిగా చేసిందని అన్నారు. ఆ వివాదం తర్వాతే తాను ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెట్టానన్నారు. మంకీ గేట్ వివాదం నుంచి తాను కోలుకోలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఈ వివాదం సైమండ్స్ కెరీర్‌లో చేదు అనుభవంగా మిగిలిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.