యాప్నగరం

ధోనీ బిడ్డా.. ఒక్కసారి వచ్చి పోవా..?

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రాకకై ఖరగ్‌పూర్‌లో ‌కళావతి అనే బామ్మ దశాబ్దకాలంగా ఎదురుచూస్తోంది. టీమిండియాకి ఎంపిక

TNN 14 Oct 2017, 8:59 am
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రాకకై ఖరగ్‌పూర్‌లో ‌కళావతి అనే బామ్మ దశాబ్దకాలంగా ఎదురుచూస్తోంది. టీమిండియాకి ఎంపిక అవకముందు ఖరగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ధోనీ కొంతకాలం టీసీగా పనిచేశాడు. ఈ సమయంలో రైల్వేశాఖ కేటాయించిన ఓ ఇంట్లో ఉన్న ధోనీకి ఈ బామ్మే అన్నీ తానై పనులు చేసిపెట్టేది. ఒకసారి ధోనీ తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు అమ్మలా సపర్యలు చేయడంతో అప్పటి నుంచి ‘అమ్మా’ అని అతను పిలిచేవాడట.
Samayam Telugu ms dhoni called me mother kalavathi
ధోనీ బిడ్డా.. ఒక్కసారి వచ్చి పోవా..?


13 ఏళ్ల క్రితం భారత్ జట్టు నుంచి పిలుపురావడంతో బామ్మ వద్ద ఆశీర్వాదం తీసుకున్న ధోనీ.. తప్పకుండా మళ్లీ వచ్చి కలుస్తానని మాట ఇచ్చాడట. కానీ.. బిజీ షెడ్యూల్స్ కారణంగా బిడ్డ రాలేకపోతున్నాడని ఎప్పటికైనా రాకపోతాడా...? అని తాను ఇప్పటికీ ఆశగా ఎదురుచూస్తున్నట్లు 77 ఏళ్ల కళావతి వెల్లడించింది. ఈ సుదీర్ఘ నిరీక్షణలో చాలా మందిని ‘అమ్మ ఎలా ఉంది..?’ అని ధోనీ అడిగినట్లు తనకి చెప్పారని.. ఖరగ్‌పూర్‌కి వచ్చినప్పుడు కలవాలని కూడా ఇప్పటికీ ధోనీ కోరుకుంటుండటం తనకి చాలా సంతోషంగా ఉందని బామ్మ వివరించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ శుక్రవారం రాత్రి ముగిసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 22 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్ మొదలుకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.