యాప్నగరం

చెన్నై సూపర్‌ కింగ్స్‌కి ధోనీ దూరం..?

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్రసింగ్ ధోనీని వదుకోవాల్సిందేనా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువ

TNN 24 Oct 2017, 4:08 pm
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్రసింగ్ ధోనీని వదుకోవాల్సిందేనా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా గత రెండేళ్లుగా నిషేధం ఎదుర్కొన్న ఈ జట్టు మళ్లీ 2018 ఐపీఎల్‌ సీజన్‌లో పునరాగమనం చేసేందుకు రెడీ అయ్యింది. కానీ.. ఈ రెండేళ్ల కాలంలో కొత్త జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరఫున ధోనీ ఆడి ఉండటంతో.. తిరిగి చెన్నైకి వచ్చే అవకాశాలు తక్కువేనని వార్తలు వస్తున్నాయి.
Samayam Telugu ms dhoni can return to chennai super kings if ipl gcs proposal is approved
చెన్నై సూపర్‌ కింగ్స్‌కి ధోనీ దూరం..?


చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు రెండేళ్లు నిషేధం ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వద్ద కొత్తగా ఒక అభ్యర్థనని ఉంచాయి. నిషేధానికి ముందు ఉన్న జట్టులోని ఆటగాళ్లలో.. ఒక భారత క్రికెటర్‌, ఇద్దరు విదేశీ క్రికెటర్లని తాము అట్టిపెట్టుకునే అవకాశం కల్పించాలని అందులో ఈ రెండు ఫ్రాంఛైజీలు కోరాయి. ఈ అభ్యర్థనని అన్ని జట్ల ఫ్రాంఛైజీలతో నవంబరులో జరగనున్న సమావేశంలో ముందు ఉంచి.. తుది నిర్ణయం తీసుకుంటామని కౌన్సిల్ సభ్యుడు ఒకరు తెలిపారు. ఒకవేళ ఏవైనా ఫ్రాంఛైజీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. చెన్నై సూపర్ కింగ్స్‌కి ధోనీ దొరకడం కష్టమేననే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ధోనీ వేలంలోకి వస్తే.. తన పైజామాని సైతం అమ్మి కొనుగోలు చేస్తానని ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని షారూక్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.