యాప్నగరం

కెప్టేన్సీ బాధ్యతలు తీసుకున్న ఎంఎస్ ధోనీ ?

టీమిండియా మాజీ కెప్టేన్ ఎంఎస్ ధోనీ మళ్లీ జట్టు కెప్టేన్‌గా బాధ్యతలు తీసుకున్నాడా ఏంటీ అనే...

TNN 21 Jan 2017, 5:33 pm
టీమిండియా మాజీ కెప్టేన్ ఎంఎస్ ధోనీ మళ్లీ జట్టు కెప్టేన్‌గా బాధ్యతలు తీసుకున్నాడా ఏంటీ అనే సందేహం కలిగే దృశ్యాలకి వేదికైంది కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టేన్సీకి గుడ్‌బై చెప్పినప్పటికీ శనివారం మళ్లీ జట్టుని లీడ్ చేసే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు ధోని. రేపటి ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడవ చివరి వన్డే కోసం శనివారం మైదానంలో ఆప్షనల్ ప్రాక్టీస్ చేసిన ఆటగాళ్లను లీడ్ చేసిన ధోనీ అనంతరం వారికి సూచనలు, సలహాలు ఇస్తూ కనిపించాడు.
Samayam Telugu ms dhoni dhoni seen in leadership role as kohli skips optional practice
కెప్టేన్సీ బాధ్యతలు తీసుకున్న ఎంఎస్ ధోనీ ?


ప్రాక్టీస్ సెషన్ పూర్తికాగానే పిచ్‌ని పరిశీలించి అక్కడి లోకల్ సిబ్బంది నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాడు ధోనీ. ఈ ప్రాక్టీస్ సెషన్‌‌కి కెప్టేన్ విరాట్ కోహ్లీ డుమ్మా కొట్టడంతోపాటు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఆ చుట్టుపక్కల లేకపోవడంతో అప్పటి పరిస్థితిని సమీక్షించడం కోసం ధోనీనే మళ్లీ కెప్టేన్ అవతారమెత్తాడన్నమాట.

పిచ్‌ని దగ్గరగా పరిశీలించడం కోసం మోకాళ్లపై కూర్చుని రెండు చేతులతో పిచ్‌ని తాకిచూశాకే తన సందేహాలని నివృత్తి చేసుకున్న ధోనీ అనంతరం నేషనల్ సెలెక్టర్ కమ్ బెంగాల్ మాజీ కెప్టేన్ దేవంగ్ గాంధీతో సుదీర్ఘంగా చర్చించాడు. ఇవేకాకుండా ఇంగ్లండ్‌తో జరిగిన 2వ వన్డేలోనూ ఫీల్డింగ్ సెట్ చేస్తూ, కోహ్లీకి సలహాలు ఇస్తూ ఆ మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ధోనీ గురించి భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతూ... " కెప్టేన్ తర్వాత మళ్లీ మ్యాచ్ పరిస్థితిని అంతా సమీక్షించి, సూచనలు, సలహాలు ఇచ్చేది వికెట్ కీపరే. ఆటలో ప్రతీ విషయాన్ని అతడు చాలా దగ్గరిగా గమనిస్తాడు. అందుకే బ్యాట్స్‌మెన్ ఆటతీరు, ప్లేయింగ్ స్టైల్ గురించి కొన్ని ఐడియాలు కూడా ఇస్తారు" అని అన్నాడు. అన్నట్టు ఈ ఆప్షనల్ సెషన్స్‌కి డుమ్మా కొట్టినవాళ్లలో కోహ్లీతోపాటు రవిచంద్రన్ అశ్విన్, యువరాజ్ సింగ్, లోకేష్ రాహుల్, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్య వంటి వాళ్లు కూడా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.