యాప్నగరం

స్కైడైవింగ్ చేస్తూ.. ఎంజాయ్ చేసిన ధోనీ

టీమిండియా టెస్టు క్రికెట్ ఆడుతుండగా.. ఖాళీ సమయాన్ని ధోనీ తనదైన రీతిలో గడుపుతున్నాడు.

TNN 2 Dec 2017, 12:16 pm
టీమిండియా శ్రీలంకతో టెస్ట్ క్రికెట్ ఆడుతూ బిజీగా ఉంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతోన్న మాజీ కెప్టెన్ ధోనీ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇటీవలే లెఫ్టినెంట్ హోదాలో శ్రీనగర్లోని ఆర్మీ స్కూల్‌ను సందర్శించిన ధోనీ.. విద్యార్థులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మరి కొద్ది రోజుల్లో ధోనీ హాలీడేస్ ముగియనున్నాయి. భారత జట్టు లంకతో వన్డే, టీ20లు ఆడనుంది. స్కై డైవింగ్ సూట్‌లో దిగిన ఫొటోలను శుక్రవారం ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మిస్టర్ కూల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Samayam Telugu ms dhoni goes skydiving to spend his vacations
స్కైడైవింగ్ చేస్తూ.. ఎంజాయ్ చేసిన ధోనీ


ధోనీ ఇటీవల వేగంగా ఆడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ధోనీ ఆటతీరుపై మాజీలు విమర్శలు చేశారు. పొట్టి ఫార్మాట్ నుంచి మహీ తప్పుకోవాలని సూచించారు. కానీ ధోనీకి కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే.

  A post shared by @mahi7781 on Dec 1, 2017 at 4:40am PST

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.