యాప్నగరం

టీ20ల్లో 14 ఏళ్లుగా ధోనీ ఖాతాలో చెత్త రికార్డ్

14 ఏళ్లుగా ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లాడుతున్న ధోనీ.. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా గెలిపించే ప్రదర్శన కనబర్చలేదా..? మరి 98 మ్యాచ్‌ల్లో అతనికి ఎందుకు ఆ అవార్డు దక్కలేదు.

Samayam Telugu 20 Apr 2020, 9:39 pm
మహేంద్రసింగ్ ధోనీ.. క్రికెట్ ప్రపంచంలోనే మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన ఏకైక కెప్టెన్. భారత క్రికెట్‌లో తిరుగులేని ఫినిషర్.. ఓవర్ వ్యవధిలోనే మ్యాచ్‌లను మలుపు తిప్పగల హిట్టర్. కానీ.. 14 ఏళ్లుగా అంతర్జాతీయ టీ20ల్లో ఓ చెత్త రికార్డ్‌ని ధోనీ కొనసాగిస్తున్నాడు.
Samayam Telugu MS Dhoni Retairment


Read More: చిత్రాంగదాకి ఇష్టమైన భారత క్రికెటర్ ఎవరంటే..?

2006లో తొలి టీ20 మ్యాచ్ ఆడిన ధోనీ.. ఇప్పటి వరకూ 98 మ్యాచ్‌లాడి కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ‘‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌‌’’గా నిలవలేకపోయాడు. క్రికెట్ చరిత్రలో 71కిపైగా టీ20లు ఆడినా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవని ఏకైక క్రికెటర్ ధోనీ మాత్రమే. గత ఏడాది నుంచి టీమిండియాకి దూరంగా ఉంటున్న ధోనీ.. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని యోచిస్తున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 98 టీ20 మ్యాచ్‌లాడిన ధోనీ.. 37.6 సగటుతో 1,617 పరుగులు చేశాడు. ఇందులో 116 ఫోర్లు, 52 సిక్సర్లు ఉండగా.. కేవలం రెండు హాఫ్ సెంచరీలను మాత్రమే ధోనీ నమోదు చేశాడు. వన్డే, టీ20ల్లో ఎక్కువగా స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్ చేసే ధోనీకి సాధారణంగా తక్కువ బంతులు ఆడే అవకాశం వస్తుంటుంది.

Read More: ధోనీ కంటే రోహిత్ బెస్ట్ ఐపీఎల్ కెప్టెన్: గంభీర్

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవకుండా ఎక్కువ టీ20 మ్యాచ్‌లాడిన ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే..? 98 మ్యాచ్‌లతో ధోనీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అతని తర్వాత వరుసగా దినేశ్ రామ్‌దిన్ (71 మ్యాచ్‌లు), అస్గర్ అఫ్గాన్ (69), విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ (61), దినేశ్ చండిమాల్ (54) టాప్-5లో కొనసాగుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.