యాప్నగరం

ధోనీ మళ్లీ ఇన్నాళ్లకి డిసైడయ్యాడు..!: ఎమ్మెస్కే

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలో అత్యుత్తమంగా ఆడటం ద్వారా మహేంద్రసింగ్ ధోనీ అందరికీ స్పష్టమైన సందేశం పంపాడు. అదేంటంటే..? -టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్

Samayam Telugu 11 Feb 2019, 7:33 pm

ప్రధానాంశాలు:

  • మే నెల ఆఖరి వారంలో వన్డే ప్రపంచకప్ మొదలు
  • ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ అర్ధశతకాలు బాదిన ధోని
  • న్యూజిలాండ్‌‌తో సుదీర్ఘ సిరీస్‌లోనూ బ్యాట్‌తో మెరిసిన మాజీ కెప్టెన్
  • ప్రపంచకప్‌లో ధోనీనే భారత్‌కి కీలకమంటూ చీఫ్ సెలక్టర్ వ్యాఖ్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu 2.
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ ఫామ్ అందుకోవడంపై టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడాది పేలవ ఫామ్‌తో కనీసం ఒక్క అర్ధశతకం కూడా సాధించలేకపోయిన ధోనీ.. ఈ ఏడాది ఆరంభంలోనే ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్‌లో ‘హ్యాట్రిక్’ హాఫ్ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల న్యూజిలాండ్ గడ్డపై ముగిసిన ఐదు వన్డేల సిరీస్, మూడు టీ20ల సిరీస్‌లోనూ ఈ మాజీ కెప్టెన్ బ్యాట్ ఝళిపిస్తూ అభిమానుల్ని అలరించాడు. దీంతో.. ఈ ఏడాది మే నెలలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ధోనీ ఆడటంపై గత కొంతకాలంగా నెలకొన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోయాయి.
ధోనీ ఫామ్‌ అందుకోవడం గురించి తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ ‘ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలో అత్యుత్తమంగా ఆడటం ద్వారా మహేంద్రసింగ్ ధోనీ అందరికీ స్పష్టమైన సందేశం పంపాడు. అదేంటంటే..? తను ఇకపై మునుపటిలా సహజ సిద్ధంగా హిట్టింగ్ చేస్తానని..! వాస్తవానికి మనకు తెలిసిన ధోనీ ఆట ఇదే. గతంలో ప్రత్యర్థులపై అతను విరుచుకుపడిన తీరుని మరోసారి మనకి గుర్తు చేశాడంతే..! ప్రపంచకప్‌కి ముందు ధోనీ ఐపీఎల్ 2019 సీజన్‌లో దాదాపు 14-16 మ్యాచ్‌లు ఆడతాడు. అంటే..? ఇదే ఫామ్‌ని వరల్డ్‌కప్‌ వరకూ కొనసాగించే అవకాశం ఉందన్నమాట. ధోనీ ఇలా మళ్లీ మునుపటి‌లా హిట్టింగ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచకప్‌లో ధోనీనే టీమిండియాలో కీలక ఆటగాడు’ అని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.