భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 600 వికెట్లు సాధించిన మూడో వికెట్ కీపర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఆరో వన్డేలో ఠాకూర్ బౌలింగ్‌లో ఆమ్లా క్యాచ్ అందుకున్న మహీ ఈ ఫీట్ సాధించాడు. అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్ల జాబితాలో సఫారీ ప్లేయర్ మార్క్ బౌచర్ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌచర్ 952 క్యాచ్‌లు అందుకున్నాడు.
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 813 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. గిల్లీ 396 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ధోనీ 494 మ్యాచ్‌ల్లో 600 క్యాచ్‌లతోపాటు 174 స్టంపౌట్లు చేశాడు. ధోనీ తర్వాతి స్థానంలో ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలి (560), కుమార సంగక్కర (539) ఉన్నారు.