యాప్నగరం

కెప్టెన్‌గా టెస్టుల్లో ధోనీ ఇంకొంచెం..?

వన్డే, టీ20ల్లో కెప్టెన్‌గా భారత్‌కి తిరుగులేని విజయాలు అందించిన మహేంద్రసింగ్ ధోనీ.. టెస్టుల్లో మాత్రం ఆ స్థాయిలో జట్టుని

TNN 2 Mar 2018, 2:48 pm
వన్డే, టీ20ల్లో కెప్టెన్‌గా భారత్‌కి తిరుగులేని విజయాలు అందించిన మహేంద్రసింగ్ ధోనీ.. టెస్టుల్లో మాత్రం ఆ స్థాయిలో జట్టుని నడిపించలేకపోయాడని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’ పేరుతో ఇటీవల గంగూలీ తన ఆత్మకథని పుస్తక రూపంలో తీసుకురాగా.. ప్రచారంలో భాగంగా ఓ మీడియా సంస్థకి ఈ మాజీ కెప్టెన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సమయంలోనే ‘క్రికెట్‌ ప్రపంచంలోనే మేటి కెప్టెన్ ఎవరు..?’ అనే ప్రశ్న గంగూలీకి ఎదురవగా.. మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లి కెప్టెన్సీ ఘనతల గురించి మాట్లాడి చివరికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పేరు చెప్పాడు.
Samayam Telugu ms dhoni remarkable captain in shorter formats but should have done better in tests sourav ganguly
కెప్టెన్‌గా టెస్టుల్లో ధోనీ ఇంకొంచెం..?


‘మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లి అద్భుతమైన కెప్టెన్లు. వారి మధ్య పోలికలు తీయాలంటే చాలా కష్టం. అయితే.. కెప్టెన్‌గా ధోనీ చాలా ప్రత్యేకం. వన్డే, టీ20ల్లో అతను సాధించిన ఘనతలు అమోఘం. కానీ.. టెస్టు క్రికెట్‌లో మాత్రం కెప్టెన్‌గా ధోనీ ఇంకొంత మెరుగైన ప్రదర్శన చేసుండాల్సింది. ప్రస్తుతం మంచి కెప్టెన్‌గా ఎదిగే లక్షణాలు విరాట్ కోహ్లీకి ఉన్నాయి. అయితే.. నా వరకు మేటి కెప్టెన్ అంటే ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్‌వానే’ అని గంగూలీ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.