యాప్నగరం

జులపాల జుట్టుతో మళ్లీ మహేంద్రసింగ్ ధోని

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ జులపాల జుట్టుతో క్రికెట్ అభిమానులకి దర్శనమిచ్చాడు. రోమన్ చక్రవర్తి

TNN 6 Mar 2018, 9:36 am
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ జులపాల జుట్టుతో క్రికెట్ అభిమానులకి దర్శనమిచ్చాడు. రోమన్ చక్రవర్తి తరహాలో డ్రెస్‌ వేసుకుని.. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు‌ సహచరుల్లో స్ఫూర్తి నింపేలా గట్టి సందేశమిచ్చాడు. ఇదంతా ఏప్రిల్ 7 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2018 సీజన్ కోసం అనుకుంటున్నారా..?
Samayam Telugu ms dhoni wears long hair once again
జులపాల జుట్టుతో మళ్లీ మహేంద్రసింగ్ ధోని


మహేంద్రసింగ్ ధోనీని ఇటీవల ‘స్నికర్స్ చాక్లెట్స్‌’ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ప్రచారంలో భాగంగా ధోనీతో ఓ 35 సెకన్ల నిడివిగల యాడ్‌ని ఆ సంస్థ రూపొందించింది. డ్రెస్సింగ్ రూములో ప్రత్యర్థిపై తొలుత కోపంతో ఊగిపోయిన ధోని.. స్నికర్స్ చాక్లెట్ తిన్న తర్వాత కూల్‌‌గా అయిపోవడంతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలోకి మారిపోవడం ఈ యాడ్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం నుంచి శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి మహేంద్రసింగ్ ధోనీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.