యాప్నగరం

​ ఇండోర్ టీ20లో ధోనీ స్టైల్ స్టంపౌట్స్

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ల వెనుక తన వేగం ఏ పాటిదో మరోసారి క్రికెట్ ప్రపంచానికి గుర్తు చేశాడు. శ్రీలంక జట్టుతో ఇండోర్

TNN 23 Dec 2017, 6:04 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ల వెనుక తన వేగం ఏ పాటిదో మరోసారి క్రికెట్ ప్రపంచానికి గుర్తు చేశాడు. శ్రీలంక జట్టుతో ఇండోర్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రెండు కళ్లు చెదిరే స్టంపౌట్స్‌తో ధోనీ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్‌ 15వ ఓవర్ కుల్దీప్ యాదవ్.. బంతిని ప్లైటెడ్ డెలివరీ రూపంలో విసరగా దాన్ని ముందుకు వంగి హిట్ చేసేందుకు శ్రీలంక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ గుణరత్నె ప్రయత్నించాడు.
Samayam Telugu ms dhonis lightning glovework in 2nd t20i leaves fans awe struck
​ ఇండోర్ టీ20లో ధోనీ స్టైల్ స్టంపౌట్స్


కానీ.. బంతి అతని బ్యాట్‌కి దొరక్కుండా ధోనీ చేతుల్లోకి వెళ్లగా.. క్షణాల వ్యవధిలోనే బెయిల్స్‌ని ధోనీ ఎగరగొట్టేశాడు. తర్వాత ఓవర్‌లోనే మరో స్పిన్నర్ చాహల్ విసిరిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్‌ బంతిని షాట్‌ కొట్టేందుకు క్రీజు వదిలి ముందుకు వచ్చిన సమరవిక్రమ.. బంతి అందకపోవడంతో స్టంపౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 88 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. మూడో టీ20 మ్యాచ్ వాంఖడే వేదికగా ఆదివారం జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.