యాప్నగరం

ధోని ఫోన్లు దొరికేశాయ్.. అతను దొంగ కాదు

అగ్ని ప్రమాదం జరగడంతో హడావుడిగా క్రికెటర్లు వెలుపలకి వచ్చేశారు. మంటలను పూర్తిగా అగ్నిమాపక సిబ్బందికి ఆర్పివేసిన

TNN 20 Mar 2017, 1:47 am
హోటల్‌లో విలువైన తన ఫోన్లు పోయాయని ఫిర్యాదు చేసిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫోన్లను పోలీసులు భద్రంగా అతనికి అప్పగించారు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బెంగాల్‌తో మ్యాచ్ ఆడేందుకు దిల్లీలోని వెల్‌కమ్ హోటల్‌లో ఝార్ఖండ్ జట్టు బస చేసింది. అయితే శుక్రవారం ఉదయం ఆ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో హడావుడిగా క్రికెటర్లు వెలుపలకి వచ్చేశారు. మంటలను పూర్తిగా అగ్నిమాపక సిబ్బందికి ఆర్పివేసిన అనంతరం లగేజీని సర్దే సమయంలో ఫోన్లు కనపడకపోవడంతో ధోనీ స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ జరిపిన పోలీసులు, సీసీ పుటేజీల ఆధారంగా విచారణ జరిపి ఫోన్లను రికవరీ చేశారు.
Samayam Telugu ms dhonis phones recovered
ధోని ఫోన్లు దొరికేశాయ్.. అతను దొంగ కాదు


‘తొలుత హోటల్ సిబ్బందితో మాట్లాడి.. అనుమానం వచ్చిన వారిని ప్రశ్నించాం. అనంతరం సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలించగా మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు ఆ ఫోన్లను తనతో తీసుకెళ్లినట్లు గుర్తించాం. కేసు విషయం తెలిసి అతను తిరిగి వాటిని మాకు
అప్పగించాడు. ఈ ఫోన్లు ఎవరివో తెలియక తన వద్దనే ఉంచుకున్నట్లు విచారణలో ​ అతను వెల్లడించాడు. ఇది వస్తువులను అందజేసే విషయంలో జరిగిన పొరపాటే తప్ప దొంగతనం కాదు’ అని దిల్లీ పోలీస్ చీఫ్ వెల్లడించారు. మరోవైపు హోటల్ సిబ్బందిపై కూడా దొంగతనం కింద కేసు నమోదు చేసి ఉండటంతో విచారణకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని హోటల్ యాజమాన్యం వెల్లడించింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఝార్ఖండ్‌ కెప్టెన్ ధోని జట్టును గెలిపించుకోలేకపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.