యాప్నగరం

ధోనీ తలరాతను ఆ టోర్నీ డిసైడ్ చేస్తుంది..!

చిన్ననాటి నుంచి ఎవరి చేత వేలెత్తి చూపించుకోవడానికి ధోని ఇష్టపడే వాడు కాదు. టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించడం

TNN 14 Mar 2017, 10:40 am
మైదానంలో ప్రత్యర్థులపై ధోని రచించే వ్యూహాలే కాదు.. కెరీర్ గురించి వెలుపల తీసుకునే సంచలన నిర్ణయాలు కూడా ఎవరి అంచనాలకు అందవు. మూడేళ్ల క్రితం అనూహ్యంగా టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించడం, ఈ ఏడాది వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఈ కోవకే చెందుతాయి. తాజాగా ప్రపంచకప్ 2019లో ధోని బరిలోకి దిగతాడా లేదా అనే చర్చ మొదలైంది. ఇటీవల భారత్ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా తన అంచనా ప్రకారం ధోని ప్రపంచకప్ ఆడకపోవచ్చని తెలిపాడు. కానీ.. ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ మాత్రం మరో మూడు నెలల్లో ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీతో ధోని తలరాత డిసైడ్ అవుతుందని అభిప్రాయపడ్డారు.
Samayam Telugu ms dhonis sole focus is on icc champions trophy 2017
ధోనీ తలరాతను ఆ టోర్నీ డిసైడ్ చేస్తుంది..!


‘ప్రస్తుతం ధోని దృష్టి అంతా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటంపైనే ఉంది. అక్కడ అతను బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించగలిగితే అతను కచ్చితంగా ప్రపంచకప్ 2019లో బరిలోకి దిగుతాడు. వయసు పెరిగేకొద్దీ మునుపటిలా దూకుడుగా ఆడలేకపోవడం సహజమే. కానీ.. మ్యాచ్ స్థితిని అంచనా వేయడం, ఆకళింపు చేసుకోవడం వంటివి ధోనీని ప్రత్యేకంగా నిలబెడతాయి. మెగా టోర్నీకి ముందు ఫామ్ అందుకోవడానికే ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ కూడా ధోని ఆడాడు. ఒకవేళ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ధోని విఫలమైతే అతను సంచలన నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే చిన్ననాటి నుంచి ఎవరి చేత వేలెత్తి చూపించుకోవడానికి ధోని ఇష్టపడే వాడు కాదు. టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించడం ఈ కోవకే చెందుతుంది’ అని కేశవ్ బెనర్జీ వివరించాడు. రాంచీలోని జవహర్ విద్యా మందిర్‌లో ఫుట్‌బాల్ గోల్ కీపర్‌‌గా ఉన్న ధోనీని.. వికెట్ కీపర్‌గా మార్చి క్రికెట్లో బెనర్జీ శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.