యాప్నగరం

ధోనీ చేసేది వికెట్ కీపింగ్ కాదు..!

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చేసేది సంప్రదాయ వికెట్ కీపింగ్ కాదని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్

TNN 13 Feb 2018, 10:23 am
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చేసేది సంప్రదాయ వికెట్ కీపింగ్ కాదని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో మంగళవారం సాయంత్రం 4.30 నుంచి ఐదో వన్డే జరగనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శ్రీధర్.. ధోనీ వికెట్ కీపింగ్‌ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్డేల్లో ఇటీవల 400 ఔట్లలో పాలుపంచుకున్న తొలి భారత క్రికెటర్‌గా మహేంద్రసింగ్ ధోనీ సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.
Samayam Telugu ms dhonis wicketkeeping style is not classical but it works well for him r sridhar
ధోనీ చేసేది వికెట్ కీపింగ్ కాదు..!


‘మహేంద్రసింగ్ ధోనీ మ్యాచ్‌కి ముందు నెట్స్‌లో అసలు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడు. కానీ.. మ్యాచ్‌లో మాత్రం కళ్లుచెదిరే రీతిలో రనౌట్లు, మెరుపు స్టంపౌట్‌లు చేస్తుంటాడు. అతనికి ఒక సొంత వికెట్ కీపింగ్ శైలి ఉంది. అది సంప్రదాయబద్ధంగా లేదు. కానీ.. అద్భుతాలు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే.. ఆ స్టైల్ అతనికే సెట్ అవుతుందేమో..? అందుకే.. ఇప్పటికీ ఏ యువ క్రికెటర్‌ కూడా అతనికి పోటీ ఇవ్వలేకపోతున్నాడు’ అని ఆర్. శ్రీధర్ కొనియాడాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు 316 వన్డేలాడిన మహేంద్రసింగ్ ధోని 295 క్యాచ్‌లు, 106 స్టంపింగ్‌లు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.