మాజీ మంత్రి, వ్యాపారవేత్త ప్రఫుల్ పటేల్ కూతురు పూర్ణ సంగీత్ వేడుకలో ధోనీ భార్య సాక్షి స్టెప్పులతో అదరగొట్టింది. గురువారం నిర్వహించిన సంగీత్ వేడుకకు భారీగా క్రికెటర్లు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకలో భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి ధోనీ పాల్గొన్నాడు. పూర్ణ సంగీత్ వేడుకలో సాక్షి స్టెప్పులతో అదరగొట్టింది. సాక్షి డ్యాన్స్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రఫుల్ పటేల్ కూతురు పూర్ణ ధోనీ భార్యకు బెస్ట్ ఫ్రెండని తెలుస్తోంది. అందుకే సంగీత్ వేడుకలో ఎక్కడ చూసినా ఆమే కనిపించింది. ధోనీ కూతురు జీవా డ్యాన్స్ చేస్తోన్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడిన ధోనీ.. ఇటీవలే ఇండియా తిరిగొచ్చాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద గడ్డంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించిన మహీ.. ఇండియా వచ్చాక క్లీన్ షేవ్‌తో హ్యాండ్సమ్గా కనిపించాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఆగష్టు 1 నుంచి ప్రారంభం కానుంది.