యాప్నగరం

విజయ్ రికార్డ్ శతకం.. టీమిండియాకు తలనొప్పులు!

నాగ్‌పూర్ టెస్టులో శతకం బాదిన విజయ్.. టెస్టులో పదో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

TNN 25 Nov 2017, 3:53 pm
భారత ఓపెనర్ మురళీ విజయ్ నాగ్‌పూర్ టెస్టులో అద్భుత శతకంతో సత్తా చాటాడు. టెస్టుల్లో విజయ్‌కు ఇది పదో సెంచరీ కావడం గమనార్హం. భారత జట్టు తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన టెస్ట్ ఓపెనర్ల జాబితాలో విజయ్ మూడోస్థానంలో నిలిచాడు. టెస్టుల్లో ఎక్కువ సెంచరీలు సాధించిన భారత ఓపెనర్ల జాబితాలో 33 శతకాలతో సునీల్ గావస్కర్ తొలిస్థానంలో ఉన్నాడు. 22 సెంచరీలతో వీరేంద్ర సెహ్వాగ్ రెండోస్థానంలో నిలిచాడు. నాగ్‌పూర్ టెస్టు ముందు వరకూ గంభీర్, విజయ్ 9 సెంచరీలతో నిలవగా.. తాజా శతకంతో విజయ్ గౌతీని వెనక్కి నెట్టాడు.
Samayam Telugu murali vijay is the third indian opener to score 10 centuries in tests
విజయ్ రికార్డ్ శతకం.. టీమిండియాకు తలనొప్పులు!


ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా మురళీ విజయ్‌కు మణికట్టు గాయమైంది. దీంతో శ్రీలంక పర్యటనకు ఓపెనర్‌గా శిఖర్ ధావన్ జట్టులో చోటు సంపాదించాడు. సొంత గడ్డ మీద లంకతో సిరీస్‌లో కూడా శిఖర్‌కే చోటు దక్కింది. కోల్‌కతా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కొద్దిలో సెంచరీ చేజార్చుకున్న ధావన్.. సోదరి వివాహం కారణంగా రెండో టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో అతడి స్థానంలో మురళీ విజయ్‌కు మళ్లీ అవకాశం లభించింది. రాక రాక వచ్చిన అవకాశాన్ని విజయ్ చక్కగా ఒడిసి పట్టుకున్నాడు. సెంచరీతో సత్తా చాటాడు.


మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా వరుసగా అర్ధ సెంచరీలు సాధిస్తున్నాడు. కోల్‌కతా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినప్పటికీ.. తర్వాతి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్నాడు. దీంతో లంకతో చివరి టెస్టుతోపాటు దక్షిణాఫ్రికా పర్యటనకు ఎవరితో ఓపెనింగ్ చేయాలో తెలియని సందిగ్ధంలో సెలక్టర్లు పడిపోయారు. ఈ ముగ్గురిలో నుంచి ఇద్దరిని సెలక్ట్ చేయడం మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.