యాప్నగరం

బౌలర్‌కు షాక్.. రెండేళ్లు ఐపీఎల్ ఆడకుండా బంగ్లా బోర్డు నిర్ణయం

ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ వచ్చే రెండేళ్లపాటు విదేశీ టీ20 లీగ్‌లు ఆడకుండా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 21 Jul 2018, 1:14 pm
ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ వచ్చే రెండేళ్లపాటు విదేశీ టీ20 లీగ్‌లు ఆడకుండా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. బంగ్లా జట్టులో కీలక ఆటగాడైన ముస్తాఫిజుర్ తరచుగా గాయాల బారిన పడుతుండటంతో బీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ సహా ఇతర టీ20 లీగ్‌ల్లో ఆడేందుకు అతడికి అనుమతి నిరాకరించింది. ఈ విషయాన్ని బీసీబీ ప్రెసిడెంట్ నజ్మల్ హసన్ ఇప్పటికే రెహ్మాన్‌కు తెలిపారు.
Samayam Telugu mustafizur


2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ముస్తాఫిజుర్ గాయాల కారణంగా చాలా సందర్భాల్లో మ్యాచ్‌లకు దూరమయ్యాడు. 2016లో ససెక్స్ తరఫున నాట్‌వెస్ట్ టీ20 బ్లాస్ట్‌లో ఆడిన మస్తాఫిజుర్ భుజానికి గాయమైంది. దీంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. కాలి మడమ గాయం కారణంగా గతేడాది దక్షిణాఫ్రికాలో జరిగిన మూడ వన్డేల సిరీస్‌కు అతడు దూరమయ్యాడు.

ముస్తాఫిజుర్‌ 2018 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. సన్‌రైజర్స్ దగ్గర్నుంచి ఈ బంగ్లా బౌలర్‌ను రూ.2.2 కోట్లకు వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కాగా.. ఐపీఎల్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత ముస్తాఫిజుర్ వేలికి గాయమైంది. దీంతో అప్ఘాన్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇలా వరుసబెట్టి గాయాలపాలవడంతో.. టీ20 లీగ్‌లు ఆడకుండా బీసీబీ నిర్ణయం తీసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.