యాప్నగరం

పిచ్ అర్థం కావడానికి 1200 బంతులేశాడట

అశ్విన్ బౌలింగ్ వీడియోలు చాలా చూశాను. దుబాయ్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో దాదాపు 1200 బంతులు

TNN 4 Mar 2017, 8:19 pm
బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో వైవిధ్యమైన స్పిన్ బంతులతో భారత్‌ను ముప్పుతిప్పలు పెట్టిన ఆస్ట్రేలియా స్పిన్నర్ లియాన్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. శనివారం ఆరంభమైన ఈ టెస్టులో లియాన్ (8/50) ధాటికి భారత్ 189 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత లియాన్ మాట్లాడుతూ భారత్‌తో సిరీస్‌కి ముందు ఉపఖండం పిచ్‌లపై అవగాహన కోసం తను ఎలా ప్రాక్టీస్ చేశాడో వివరించాడు.
Samayam Telugu nathan lyon watched ashwins videos to learn bowling tricks
పిచ్ అర్థం కావడానికి 1200 బంతులేశాడట


‘భారత్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు తీసిన తర్వాత ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. ఈ సిరీస్‌కి ముందు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ వీడియోలు చాలా చూశాను. దుబాయ్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో దాదాపు 1200 బంతులు వరకు విసురుంటాను. ఏది ఏమైనా నా బలాన్ని నమ్ముకుని పిచ్ నుంచి బౌన్స్ రాబట్టగలిగాను. దాని ఫలితమే ఇది’ అంటూ లియాన్ ఆనందం వ్యక్తం చేశాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.