యాప్నగరం

అర్జున అవార్డ్‌ని ఊహించలేదు: హర్మన్‌ప్రీత్

కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులకి అందజేసే అర్జున అవార్డ్ తనకి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని భారత మహిళా క్రికెటర్

TNN 28 Aug 2017, 6:11 pm
కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులకి అందజేసే అర్జున అవార్డ్ తనకి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతోషం వ్యక్తం చేసింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు మొత్తం 17 మంది క్రీడాకారులు అర్జున అవార్స్‌ని అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో సోమవారం ఈ మహిళా క్రికెటర్ మాట్లాడింది. ఇంగ్లాండ్‌లో ఇటీవల ముగిసిన మహిళల ప్రపంచకప్‌ టోర్నీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై మెరుపు ఇన్నింగ్స్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Samayam Telugu never imagined i will receive arjuna awardharmanpreet kaur
అర్జున అవార్డ్‌ని ఊహించలేదు: హర్మన్‌ప్రీత్


‘ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం వచ్చినా.. అది క్రీడాకారుల్లో కచ్చితంగా ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. అర్జున అవార్డ్‌ అందుకోవడం అనేది నాకు తెలిసి ప్రతి స్పోర్ట్స్‌ పర్సన్ కల. ఇక్కడే నాలో ప్రతిభ ఉందని గుర్తించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా. భవిష్యత్‌‌లో నేను ఇంకా మెరుగైన ప్రదర్శన చేసేందుకు శ్రమిస్తా. మహిళలకి కూడా ఐపీఎల్ లాంటి టోర్నీలు నిర్వహిస్తే బాగుంటుంది. బీసీసీఐ దీనికోసం ఇప్పటికే ప్రయత్నాలు ఆరంభించింది అని అనుకుంటున్నా. కచ్చితంగా ఐపీఎల్ ద్వారా.. చాలా మంది కొత్త క్రికెటర్లు వెలుగులోకి వస్తారు’ అని హర్మన్‌ప్రీత్ వివరించింది. హర్మన్‌ప్రీత్‌తో పాటు క్రికెటర్ చతేశ్వర్ పుజారా కూడా అర్జున అవార్డ్‌కి ఎంపికయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.