యాప్నగరం

ICC చైర్మన్‌గా న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్‌క్లే ఎన్నికయ్యారు. తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న ఇమ్రాన్ ఖవాజా స్థానంలో బార్‌క్లే బాధ్యతలు చేపడతారు.

Samayam Telugu 25 Nov 2020, 8:24 am
ఐసీసీకి కొత్త బాస్ వచ్చాడు. మన దేశానికి చెందిన శశాంక్ మనోహర్ స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్‌క్లే ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కమర్షియల్ లాయర్ అయిన బార్‌క్లే 2012 నుంచి న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. శశాంక్ తర్వాత ఐసీసీకి రెండో స్వతంత్ర చైర్మన్ గ్రెగ్ కానున్నాడు.
Samayam Telugu Greg Barclay


ఐసీసీ బోర్డులో న్యూజిలాండ్ క్రికెట్ ప్రతినిధిగా ఉన్న బార్‌క్లే తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. మనోహర్ రెండేళ్ల పదవీ కాలం జులైతో ముగియడంతో.. తాత్కాలికంగా ఆ బాధ్యతలను ఇమ్రాన్ ఖవాజా నిర్వహిస్తున్నారు. చైర్మన్ పదవి కోసం ఖవాజా, గ్రెగ్ పోటీపడగా.. తొలి రౌండ్‌లో బార్‌క్లేకు 10 ఓట్లు, ఖవాజాకు 6 ఓట్లు పడ్డాయి. తర్వాతి రౌండ్లో దక్షిణాఫ్రికా బార్‌క్లేకు ఓటేయడంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం మూడింట రెండొంతుల మెజార్టీ సాధించిన ఆయన చైర్మన్ పదవికి ఎన్నికయ్యారు.

2015 పురుషుల వరల్డ్ కప్ డైరెక్టర్‌గా బార్‌క్లే వ్యవహరించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు చెందిన చాలా కంపెనీల్లో డైరెక్టర్ హోదాలో ఆయన పని చేశారు. ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా ఐసీసీలోని డైరెక్టర్లకు బార్‌క్లే ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.