యాప్నగరం

ఆసీస్ వెళ్లింది.. కివీస్ వచ్చేసింది

భారత్‌తో సుదీర్ఘ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా స్వదేశానికి పయనమవగానే.. న్యూజిలాండ్ జట్టు ఇక్కడ వాలిపోయింది.

TNN 14 Oct 2017, 3:43 pm
భారత్‌తో సుదీర్ఘ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా స్వదేశానికి పయనమవగానే.. న్యూజిలాండ్ జట్టు ఇక్కడ వాలిపోయింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ ఔట్‌ఫీల్డ్ బురదగా ఉండటంతో రద్దయిన విషయం తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్‌ 1-1గా ముగిసి.. ట్రోఫీని ఇరు జట్లు పంచుకున్నాయి.
Samayam Telugu new zealand players arrive in india for limited overs series
ఆసీస్ వెళ్లింది.. కివీస్ వచ్చేసింది


న్యూజిలాండ్‌ జట్టు భారత్‌తో అక్టోబరు 22 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. దీనికంటే ముందు అంటే.. అక్టోబరు 17 నుంచే భారత్ బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను కూడా కివీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లూ ముంబయి వేదికగానే జరగనుండటంతో శుక్రవారమే న్యూజిలాండ్ జట్టులోని 9 మంది క్రికెటర్లు అక్కడికి చేరుకున్నారు. మిగిలిన ఆరు మంది క్రికెటర్లని ప్రస్తుతం విశాఖపట్నంలో మ్యాచ్‌లు ఆడుతున్న న్యూజిలాండ్-ఎ జట్టు నుంచి ఎంపిక చేయనున్నారు. ‘మళ్లీ భారత్‌కి రావడం చాలా బాగుంది’ అంటూ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తొలి వన్డే ముంబయిలోని వాంఖడే స్టేడియంలో అక్టోబరు 22న జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.