యాప్నగరం

భారత్‌పై బదులు తీర్చుకున్న కివీస్

కోహ్లిసేనతో కీలకమైన వన్డే సిరీస్‌కి ముందు ఆత్మవిశ్వాసానిచ్చే విజయాన్ని న్యూజిలాండ్ అందుకుంది. ముంబయి వేదికగా

TNN 19 Oct 2017, 5:55 pm
కోహ్లిసేనతో కీలకమైన వన్డే సిరీస్‌కి ముందు ఆత్మవిశ్వాసానిచ్చే విజయాన్ని న్యూజిలాండ్ అందుకుంది. ముంబయి వేదికగా భారత్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో గురువారం జరిగిన రెండో ప్రాక్టీస్ వన్డేలో 33 పరుగుల తేడాతో కివీస్ గెలుపొంది.. తొలి మ్యాచ్ ఓటమికి బదులు తీర్చుకుంది. రాస్ టేలర్ (102: 83 బంతుల్లో 14x4, 1x6), టామ్ లాథమ్ (108: 97 బంతుల్లో 7x4, 2x6) శతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది.
Samayam Telugu new zealand won by 33 runs
భారత్‌పై బదులు తీర్చుకున్న కివీస్


లక్ష్య ఛేదనలో గుర్‌కీరత్ సింగ్ (65: 46 బంతుల్లో 7x4, 3x6), కరుణ్ నాయర్ (53: 54 బంతుల్లో 7x4) అర్ధశతకాలు బాదినా.. మిగతా బ్యాట్స్‌‌మెన్ నిరాశపరచడంతో భారత్ ప్రెసిడెంట్స్ జట్టు 47.1 ఓవర్లలో 310 పరుగులకు ఆలౌటైంది. భారీ అంచనాల మధ్య రెండు మ్యాచ్‌లూ ఆడిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (7) ఘోరంగా విఫలమయ్యాడు. భారత ప్రధాన జట్టుతో వాంఖడే వేదికగా ఆదివారం తొలి వన్డేలో న్యూజిలాండ్ ఢీకొట్టనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.