యాప్నగరం

భారత్‌లో ఇప్పట్లో క్రికెట్ ఉండబోదు: గంగూలీ

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడితే.. అదే సమయంలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. అప్పటి వరకూ క్రికెట్ జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

Samayam Telugu 22 Apr 2020, 11:17 am
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత్‌లో ఇప్పట్లో క్రికెట్ ఉండబోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. జర్మనీలో కరోనా వైరస్ నియంత్రణలోకి రావడంతో అక్కడ ఫుట్‌బాల్ టోర్నీలు మే నెల మొదటి వారం నుంచి ఆరంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. భారత్‌లో ఎప్పటి నుంచి క్రికెట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది..? అని గంగూలీని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు.
Samayam Telugu Mumbai: Board of Control for Cricket in India (BCCI) president Sourav Ganguly wi...


Read More: ధోనీ హేళనతోనే వికెట్ల మధ్య ఆ రేసు మొదలైంది: బ్రావో

‘‘జర్మనీతో పోలిస్తే భారత్‌లో ఉన్న సామాజిక పరిస్థితులు వేరు. కాబట్టి.. సమీప భవిష్యత్‌లో క్రికెట్ ఆరంభమ్యే అవకాశం లేదు. అంతేకాకుండా క్రికెట్‌ చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది. స్పోర్ట్స్ కోసం అందరి లైఫ్‌ని రిస్క్‌లో పెట్టలేము కదా..?’’ అని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. నిరవధికంగా వాయిదాపడిన విషయం తెలిసిందే.

Read More: ఇషాంత్ శర్మ 4, 6.. జడేజాకి ధోనీ చివాట్లు

దక్షిణ కొరియాలో ఇప్పటికే కరోనా వైరస్ నియంత్రణలోకి రావడంతో అక్కడ బేస్‌బాల్ మ్యాచ్‌లు మొదలైపోయాయి. కానీ.. మునుపటిలా స్టేడియంలోకి మాత్రం ప్రేక్షకుల్ని అనుమించడం లేదు. ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఒకవేళ సెప్టెంబరు -అక్టోబరు మధ్యకాలంలో ఐపీఎల్‌ని నిర్వహించాల్సి వస్తే..? ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.