యాప్నగరం

జట్టుకు ధోనీ హ్యాండ్ ఇచ్చేసినట్టేనా..!

తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులను బుట్టలో వేసుకునే ధోనీ.. ఇతర క్రికెటర్లకు సలహాలిస్తూ మార్గనిర్దేశనం చేస్తుంటాడు. అందుకే కుర్రాళ్లు మహితో కలిసి ఆడాలని తహతహలాడుతుంటారు.

Samayam Telugu 8 Oct 2018, 2:08 pm
క్రికెటర్‌గా ధోనీ గొప్పదనం గురించి అందరికీ తెలిసిందే. మైదానంలో బరిలో దిగితే చాలు.. తన వ్యూహాలతో ఆటను మలుపు తిప్పగలిగే దిట్ట అతడు. అందుకే ధోనీతో కలిసి ఆడాలని చాలా మంది ఆటగాళ్లు కలగంటారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకావం కొద్ది మందికే లభిస్తుంది. కాబట్టి ధోనీతో కలిసి దేశవాళీ క్రికెట్లోనైనా ఆడాలని జార్ఖండ్ క్రికెటర్లు ఉబలాటపడతారు.
Samayam Telugu dhoni hitting


కానీ ధోనీ ఈసారి విజయ్ హజారే ట్రోఫీలో సొంత రాష్ట్రం తరఫున బరిలో దిగడం లేదు. గత ఏడాది జార్ఖండ్ తరఫున ఆరు మ్యాచ్‌ల్లోనూ మహీ ఆడాడు. విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ దశలోనైనా మహీ జార్ఖండ్ తరఫున ఆడతాడని భావించారు.

పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్న ధోనీ ఆసియా కప్ తర్వాత జార్ఖండ్ జట్టు తరఫున బరిలో దిగుతాడని ఫ్యాన్స్ భావించారు. ‘జట్టుతోపాటు ధోనీ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, మెంటార్‌ పాత్ర పోషి్తున్న ధోనీ.. ఇతర ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నాడ’ని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.