యాప్నగరం

ధోనీది తెలివైన బుర్ర.. అతడితో విభేదమా..?

కొన్ని మెసేజ్‌లు కూడా షేర్ చేసుకున్నాం. ధోనీది ప్రోత్సహించే మనస్తత్వం. కెప్టెన్సీ మార్పు మా ఇద్దరి మధ్య క్రికెట్ స్నేహాన్ని

TNN 30 Mar 2017, 5:37 pm
ఐపీఎల్ పదో సీజన్ ఆరంభానికి ముందే రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ జట్టులోని క్రికెటర్ల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఏప్రిల్ 5 నుంచి ఐపీఎల్ ఆరంభంకానున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు జట్టులో ఎవరితోనూ తనకు విభేదాలు లేవని స్పష్టం చేశాడు. పుణె జట్టుకు గత ఏడాది ధోనీ కెప్టెన్సీ వహించగా.. తాజా సీజన్‌కి మాత్రం అతడ్ని తప్పించి జట్టు పగ్గాలను స్టీవ్‌స్మిత్‌కి ఫ్రాంఛైజీ అప్పగించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు మాటల యుద్ధానికి దిగడంతో టీమిండియా వారిపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ధోనీతో పాటు భారత్ జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్ అజింక్య రహానె కూడా పుణె జట్టులో ఉన్నాడు. దీంతో స్టీవ్‌స్మిత్ తన మాటలతో
Samayam Telugu no issues between ms dhoni and me
ధోనీది తెలివైన బుర్ర.. అతడితో విభేదమా..?

ఐపీఎల్‌లో భారత క్రికెటర్ల మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నాడు.

‘నాకు ధోనీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేము ఇద్దరం ఇప్పటికే కొన్ని మెసేజ్‌లు కూడా షేర్ చేసుకున్నాం. ధోనీది ప్రోత్సహించే మనస్తత్వం. కెప్టెన్సీ మార్పు మా ఇద్దరి మధ్య క్రికెట్ స్నేహాన్ని ప్రభావితం చేయదు. అతనే కాదు.. ఎవరితోనూ నాకు గొడవలు లేవు. పుణెలో ఏప్రిల్ 3న జట్టుతో ధోని చేరుతాడు. కెప్టెన్సీ గురించి అతనితో ఇప్పటికే చాలా చర్చించాను. చివరిగా ఒకటి మాత్రం చెప్పగలను.. ధోనీ చాలా వేగంగా ఆలోచిస్తాడు. అతనిది తెలివైన బుర్ర ’ అని స్మిత్ కొనియాడాడు. గత ఏడాది ప్రధాన ఆటగాళ్లు దూరమవడంతో పేలవ ప్రదర్శన చేసిన రైజింగ్ పుణె జట్టు .. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానానికి పరిమితమైంది. జట్టు మేనేజ్‌మెంట్‌ సమావేశాలకి ధోనీ అందుబాటులో ఉండకపోవడంతోనే అతణ్ని కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు ఇప్పటికే ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా ప్రకటించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.