యాప్నగరం

కోహ్లీ రికార్డ్ ఫీట్.. ‘పేలిన’ పోలీసుల ట్వీట్

అతివేగం ప్రమాదకరమంటూ బోర్డులు పెట్టి, ప్రాణాలను కాపాడుకోండంటూ వాహనదారులను పోలీసులు తరచుగా హెచ్చరిస్తుంటారు.

Samayam Telugu 25 Oct 2018, 10:25 pm
సాధారణంగా వాహనాలు వేగంగా నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే జరిమానా విధిస్తామని చెబుతారు. అతివేగం ప్రమాదకరమంటూ బోర్డులు పెట్టి, ప్రాణాలను కాపాడుకోండంటూ హెచ్చరిస్తుంటారు. అయితే టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ వేగానికి మాత్రం తాము జరిమానా విధించలేమంటూ ముంబై పోలీసులు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samayam Telugu Virat Kohli


వన్డేల్లో సచిన్‌ 259 ఇన్నింగ్సుల్లో పదివేల పరుగుల మార్కు చేరుకోగా, వెస్టిండీస్‌తో విశాఖలో జరిగిన రెండో వన్డేలో విరాట్‌ కోహ్లీ కేవలం 10వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అధిక స్ట్రైక్ రేట్‌ కూడా కోహ్లీ తన పేరిటే లిఖించుకున్నాడు. అయితే కేవలం 205 ఇన్నింగ్స్‌ల్లో, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ అరుదైన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ అరుదైన ఘనతపై ముంబై పోలీసులు ట్వీట్ పేల్చారు.

‘ఓవర్ స్పీడ్‌కు ఇక్కడ చలానా లాంటివి ఉండవు. విరాట్ కోహ్లీకి అభినందనలు తప్ప. అద్భుతమైన ఘనత సాధించిన కోహ్లీకి బెస్ట్ విషెస్ అని’ ముంబై పోలీసులు అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. కోహ్లీ ఘనతను మెచ్చుకుంటూనే అతివేగానికి చలానా విధించలేమంటూ పోలీసులు చమత్కరిస్తూ చేసిన ట్వీట్‌ను విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు. వన్డేల్లో వేగవంతంగా కోహ్లీ 10000 పరుగుల మార్క్ చేరుకోవడాన్ని పోలీసులు ఉత్సాహంగా ట్వీట్ చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.