యాప్నగరం

కివీస్‌తో మ్యాచ్‌ని డ్రాగా ముగించిన భారత్-ఎ

ఆస్ట్రేలియా‌తో టెస్టు సిరీస్‌ కోసం పృథ్వీ షా, హనుమ విహారి, మురళీ విజయ్, అజింక్య రహానెలను ఎంపిక చేసిన భారత సెలక్టర్లు.. భారత్-ఎ జట్టు తరఫున ఆడే అవకాశం కల్పించారు.

Samayam Telugu 19 Nov 2018, 4:43 pm
న్యూజిలాండ్ పర్యటనలో భారత్-ఎ జట్టు బౌలర్లు తేలిపోయినా.. బ్యాట్స్‌మెన్స్‌ మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గత శుక్రవారం న్యూజిలాండ్-ఎ జట్టుతో ఆరంభమైన అనధికార టెస్టు మ్యాచ్‌లో నాలుగో (ఆఖరి) రోజైన సోమవారం పృథ్వీ షా (50: 53 బంతుల్లో 8x4, 1x6), మురళీ విజయ్ (60: 113 బంతుల్లో 8x4), హనుమ విహారి (51: 63 బంతుల్లో 3x4, 3x6) అర్ధశతకాలు బాదడంతో భారత్ -ఎ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 247/3తో నిలిచింది. దీంతో.. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేనందున ఇరు జట్ల కెప్టెన్లు డ్రా‌‌కి అంగీకరించారు.
Samayam Telugu 755072-mayank-agarwal-prithvi-shaw-pti


తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఎ జట్టు 467 పరుగులు చేయగా.. న్యూజిలాండ్-ఎ జట్టు 458 పరుగులతో బదులిచ్చింది. దీంతో.. కేవలం 9 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న భారత్.. ఈరోజు రెండో సెషన్‌కి రెండో ఇన్నింగ్స్‌‌లో 247/3తో నిలిచిన దశలో మ్యాచ్‌ని నిలిపివేశారు. ఈ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పృథ్వీ షా, హనుమ విహారి అర్ధశతకాలు బాదగా.. ఎట్టకేలకి మురళీ విజయ్.. హాఫ్ సెంచరీతో సత్తాచాటుకున్నాడు.

ఆస్ట్రేలియా‌తో టెస్టు సిరీస్‌ కోసం పృథ్వీ షా, హనుమ విహారి, మురళీ విజయ్, అజింక్య రహానెలను ఎంపిక చేసిన భారత సెలక్టర్లు.. భారత్-ఎ జట్టు తరఫున ఆడే అవకాశం కల్పించారు. డిసెంబరు 6 నుంచి ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. వాస్తవానికి రోహిత్ శర్మ కూడా ఈ తొలి అనధికార టెస్టు మ్యాచ్‌లో ఆడి ఉండాల్సింది. కానీ.. ఈనెల 21న (బుధవారం) ఆసీస్‌తో తొలి టీ20 జరగనుండటంతో.. శారీరకంగా అలసిపోతాడని అతడ్ని ఆఖరి నిమిషంలో జట్టు నుంచి బీసీసీఐ తప్పించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.