యాప్నగరం

ద్రవిడ్ సలహా విజయ్ శంకర్ కెరీర్‌ను మలుపు తిప్పింది

ఇటీవలే టీమిండియాకు ఎంపికైన తమిళనాడు క్రికెటర్ విజయ్ శంకర్ కెరీర్‌ను ద్రవిడ్ సలహా మలుపు తిప్పింది.

TNN 22 Nov 2017, 1:07 pm
తమిళనాడు క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడుతున్న విజయ్ శంకర్‌కు టీమిండియా నుంచి పిలుపొచ్చింది. భారత జట్టులో చోటు దక్కడం పట్ల ఈ ఆల్‌రౌండర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆనందంలో ఓ క్షణం పాటు మైండ్ బ్లాంక్ అయ్యిందని తెలిపాడు. విజయ్ శంకర్ గతంలో ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసేవాడు. ఓసారి తన ఆరాధ్య క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు బౌలింగ్ చేసే అవకాశం లభించింది.
Samayam Telugu off spinner turned medium pacer and team india latest all rounder vijay shankar
ద్రవిడ్ సలహా విజయ్ శంకర్ కెరీర్‌ను మలుపు తిప్పింది


చెపాక్‌లో రాహుల్‌కు బౌలింగ్ చేయడం విజయ్‌కు కాస్త బెరుకుగా అనిపించింది. బంతిని సరిగా విసరలేకపోయాడు. అతడి ఇబ్బందిని గమనించిన ద్రవిడ్ బంతిని అందిస్తూ.. భయపడకు, నీ బౌలింగ్ యాక్షన్ నాకు నచ్చింది. లెంగ్త్ బాగుంది. కానీ కొంచెం అదనపు వేగంతో విసురు అని సలహా ఇచ్చాడు. బ్యాటింగ్‌లోనూ ద్రవిడ్ విజయ్‌కు కిటుకులు నేర్పాడు.

ద్రవిడ్ మాటలతో విజయ్ ఆలోచనలో మార్పు వచ్చింది. అప్పటి నుంచే పేస్ బౌలింగ్ చేయడం ప్రారంభించానని తెలిపాడు. మొదట్లో ఆఫ్ స్పిన్ నుంచి మీడియం పేస్‌కు మారడం ఇబ్బందిగా తోచింది. కానీ అదే అతడికి జట్టులో చోటు దక్కేలా చేసింది. తమిళనాడు జట్టులోనూ ఎక్కువ మంది స్పిన్నర్లు ఉన్నారు. వారంతా మీడియం పేస్ బౌలింగ్ చేయమని సలహా ఇచ్చారు. కుటుంబ సభ్యులతోపాటు కోచ్ బాలాజీ సహకారంతో బౌలింగ్ యాక్షన్లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నాడు. హార్దిక్ పాండ్య తరహాలో బ్యాట్‌తో దూకుడుగా ఆడకపోయినా.. నిలకడగా పరుగులు రాబట్టగలడు. టెస్టు క్రికెట్‌కు సరిగ్గా సరిపోతాడనే కారణంతో అతణ్ని జట్టులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.