యాప్నగరం

ఒకే బంతికి రెండు వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్..!

భారత్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు బలమైన ఆహారం తీసుకోవాలని రేన్‌షా అనుకున్నాడా..?

TNN 23 Feb 2017, 1:44 pm
పుణెలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికరంగా టెస్టు మ్యాచ్ జరుగుతోంది. పేసర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (38) బౌల్డ్ కావడంతో పెవిలియన్ బాట పట్టాడు. కానీ.. అతని వెంటే మరో ఓపెనర్ రేన్‌షా (36) కూడా పెవిలియన్‌కి వెళ్లిపోయాడు. మ్యాచ్ చూస్తున్న అభిమానులతో పాటు.. మైదానంలో ఉన్న అంపైర్లు, ఆసీస్ ఆటగాళ్లు కారణం తెలియక ​ కాసేపు తికమకపడ్డారు. అప్పుడే క్రీజులోకి వస్తున్న కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా బలవంతంగా రేన్‌షాను బౌండరీ లైన్ వద్ద ఆపి ఏం జరిగిందంటూ ఆరా తీశాడు. అనంతరం ఇద్దరూ వెనక్కి వచ్చి ఫీల్డ్ అంపైర్లతో చర్చించిన అనంతరం రేన్ షా వేగంగా మైదానాన్ని వీడాడు.
Samayam Telugu one ball two wickets renshaw leaves the field retired
ఒకే బంతికి రెండు వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్..!


ఇంతకీ ఏం జరిగిందంటే.. రేన్‌షా ఉదయం నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడని.. బ్యాటింగ్ సమయంలో అది ఎక్కువ కావడంతోనే అతను మైదానాన్ని వీడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే భారత్ అభిమానులు మాత్రం అతనిపై సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు. భారత్ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మసాలా దట్టించిన ఇక్కడి రుచులను బాగా లాగించినట్లున్నాడు అంటూ చమత్కారం చేస్తున్నారు. మరికొంత మంది ఉమేశ్ యాదవ్ ఒకే బంతికి రెండు ఆసీస్ వికెట్లు పడగొట్టాడని సరదాగా అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మ్యాచ్ ఆరంభంలో క్రీజులోకి ఒకేసారి వచ్చిన ఓపెనర్లు మళ్లీ ఒకేసారి మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే ఒకరు ఔట్‌గా మరొకరు రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లారు.


ప్రస్తుతం 52 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 131 పరుగులతో కొనసాగుతోంది. షాన్ మార్ష్ (16) జయంత్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (23), పీటర్ హండ్స్‌కబ్ (9) ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.